హోమ్ /వార్తలు /తెలంగాణ /

Paddy issue : వరి వేయండి.. కోనుగోలు భాద్యత నాదే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే.

Paddy issue : వరి వేయండి.. కోనుగోలు భాద్యత నాదే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే.

సీఎం కేసీఆర్, వరి పంట

సీఎం కేసీఆర్, వరి పంట

Paddy issue : రానున్న వేసవి కాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసిఆర్ చెబుతుంటే మరోవైపు ఆపార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం వరి వేయండి అంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు.

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద వివాదమే కొనసాగుతోంది. దీంతో నువ్వా నేనా అంటూ బీజేపీ, టీఆర్ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సీఎం కేసిఆర్ ఓ వైపు యుద్దం ప్రకటిస్తూనే మరోవైపు రానున్న వేసవిలో.. మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ స్పష్టం చేశారు. ( Paddy issue ) ఒక రకంగా వరి వేయవద్దంటూ చెప్పారు. ఒకవేళ వ్యక్తిగత అవసరాలతో పాటు ఎవరైనా మిల్లర్ల హామీతో ధాన్యం పంట వేసుకోవచ్చని చెప్పారు.

అయితే ప్రభుత్వం స్పష్టం ప్రకటన చేయడంతో చాలా మంది రైతులు ధాన్యం పండించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. కాని నల్గొండలోని నాగార్జున సాగర్ ( Nagarjunasagar ) కాలువ కింద ఉన్న భూములతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన నియోజకవర్గాల నాయకులు మాత్రం ప్రజలను వరిధాన్యం పండించాలని చెబుతున్నారు.

Telangana corona : మరోసారి కరోనా నిబంధనలు.. మాస్క్ లేనివారికి 1000 జరిమాన


ఇలా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు రైతులు వరిని సాగు చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే..మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని చెప్పారు. ఇక మిర్యాలగూడతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గ రైతులు కూడా వరిని పండించాలని చెప్పారు. కాని ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవద్దని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిల్లర్లతో చర్చించానని చెప్పారు. మరోవైపు నీటికి సంబంధించి కూడా ఎలాంటీ సమస్య లేకుండా చూస్తానని హామి ఇచ్చారు. అయితే మెట్ట ప్రాంతాల ప్రజలు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. మరోవైపు వరి ధాన్యంపై రాద్దంతం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు.


Karimnagar : అక్రమ సంబంధం అంటగట్టిన మామపై దారుణం.. అర్థరాత్రి మరో యువకుడితో కలిసి..


Cyber crime : ఇదిగో అర్డర్.. అంటూ పండ్ల వ్యాపారీకి టోకరా.. శృతిమించిన సైబర్ వల


మొత్తం మీద ధాన్యం సమస్యపై రైతుల్లో మిశ్రమ స్పందన వస్తుంది. కొన్ని చోట్ల సీఎం చెప్పినట్టుగా పంటలు వేయడానికి వెనకడుగు వేస్తుండగా మరికొంత మాత్రం వేసవి కాలంలో మేలురకం ధాన్యం పండించడం ద్వారా ఎలాంటీ నష్టం వచ్చే అవకాశాలు లేవని, దీంతో పాటు స్థానికంగా ఉండే మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్న కొద్ది మంది మాత్రం ఇప్పటికే వేసవిలో ధాన్యం పండించేందుకు సంసిద్దం అవుతున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Telangana, TRS leaders

ఉత్తమ కథలు