టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ క్యాంపు కార్యాలయం కూల్చివేత

కొద్దిరోజుల కిందట కురిసిన వర్షాలకు వరంగల్ మహానగరం సముద్రాన్ని తలపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పర్యటించిన మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్.. ఆ ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

news18-telugu
Updated: September 17, 2020, 12:08 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ క్యాంపు కార్యాలయం కూల్చివేత
వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, ఈటల(ఫైల్ ఫొటో)
  • Share this:

కొద్దిరోజుల కిందట కురిసిన వర్షాలకు వరంగల్ మహానగరం సముద్రాన్ని తలపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పర్యటించిన మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్.. ఆ ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వరంగల్ నగరంలోన నాలాల విస్తరణ జరపాలని, నాలాలపై చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.


ఆ ఆదేశాల మేరకు వరంగల్ నగరపాలక అధికారలు నాలాల విస్తరణ చేపట్టారు. ఈ క్రమంలోనే వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంప్ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. పోలీసులు భద్రతతో సిబ్బంది కూల్చివేత పనులు చేపట్టారు.కాగా, వరంగల్ భద్రకాళి చెరువు నుంచి హంటర్ రోడ్ ప్రధాన రహదారికి వచ్చే వరదనీటి కాలువపై ఐదేళ్ల కిందట ఎమ్మెల్యే రమేశ్ క్యాంప్ కార్యాలయం నిర్మించారు. వరంగల్ కేటీఆర్ పర్యటన అనంతరం ఎమ్మెల్యే రమేశ్ క్యాంప్ కార్యాలయ నిర్మాణంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.


సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రమేష్..తన కార్యాలయం కూల్చివేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. నాలా ప్రవాహానికి తన ఇల్లు అడ్డుగా ఉంటే కూల్చేయవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులకు ఫోన్‍ చేసి చెప్పారు.

Published by: Sumanth Kanukula
First published: September 17, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading