TRS MINISTERS TALASANI AND VEMULA PRASHANT REDDY REACTED SHARPLY TO REMARKS MADE BY UNION HOME MINISTER AMIT SHAH AT THE CONCLUDING SESSION OF THE PRAJA SANGRAMA YATRA PRV
Amit shah | TRS: కేసీఆర్‌ను ఓడించడానికి బండి సంజయ్ చాలంటివి.. ""మరి నువ్వెందుకొచ్చినవ్.. పీకనీకొచ్చినవా?’’: అమిత్ షాపై రాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్
మంత్రి వేముల, అమిత్ షా (ఫైల్)
తెలంగాణలో రాజకీయ (Telangan politics) వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS)పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు.
తెలంగాణలో రాజకీయ (Telangana politics) వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS)పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షా లు కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని రద్దుచేసుకొని ముందస్తుకు వెళ్తే తాముకూడా ముందస్తుకు సిద్దమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav), వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashant Reddy) ఆదివారం ఉదయం సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావిని పరిశీలించారు. నిజాం కాలంనాటి మెట్ల బావి విశిష్టతను మంత్రి ప్రశాంత్ రెడ్డి కి వివరించారు తలసాని. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సహకారంతో ఈ బావిని పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. చారిత్రక వారసత్వ సంపదకు పూర్వవైభవాన్ని తెస్తున్న కేటీఆర్‌కి ధన్యవాదాలు, అధికారులను అభినందనలు తెలిపారు ఇద్దరు మంత్రులు. ఈ సందర్భంగా తలసాని, వేముల విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒకడుగు ముందుకేసి మరీ అమిత్‌షాపై విరుచుకుపడ్డారు.
ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్నారు..
కేసీఆర్ (KCR)ను ఓడించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలంటివి.. మరి నువ్వెందుకు వచ్చినవ్.. పీకనీకొచ్చినవా? అంటూ అమిత్ షాపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు, అభివృద్ధి నీ గుజరాత్లో చూపించమని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వదని ఆయన ప్రశ్నించారు. వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు మోదీ దోచి పెడుతున్నారని ఆరోపించారు వేముల. మేము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు.
కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని వేముల తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలను సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాకారం చేస్తున్నారని మంత్రి అన్నారు. డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటామంటే నష్టపోతారని, చాలా పారదర్శకంగా ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసిలో 23 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు పూర్తి అయ్యాయని తెలిపారు మంత్రి. అందులో ఏడు కాలనీలు సనత్ నగర్ నియోజకవర్గంలో పూర్తి అయ్యాయని తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని కేటీఆర్ భావించారని చెప్పారు. 60 వేల ఇండ్లు పూర్తీ దశకు వచ్చాయని 40 వేల ఇండ్లు త్వరలో పూర్తి అవుతాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.