హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS @Delhi : ఎంత ధాన్యం కొంటారు... ? కేంద్రమంత్రి పియూష్‌గోయల్‌ టీఆర్ఎస్ మంత్రుల భేటి..

TRS @Delhi : ఎంత ధాన్యం కొంటారు... ? కేంద్రమంత్రి పియూష్‌గోయల్‌ టీఆర్ఎస్ మంత్రుల భేటి..

ఫైల్ ఫోటో..

ఫైల్ ఫోటో..

TRS @Delhi : కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్‌తో ఈ బృందం సమావేశమైంది.

  వరి కొనుగోలుపై స్పష్టత తీసుకువచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం.. ( trs delegation meets central minister piyush goel ) కేంద్రం మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అయింది. ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.వీరితో పాటు రాష్ట్ర అధికారులు పాల్గోన్నారు.

  ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరింది.. ( trs delegation meets central minister piyush goel ) తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని ప్రశ్నించింది.రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించారు. ( trs delegation meets central minister piyush goel ) కాగా మంత్రి ఇతర కార్యక్రమాల్లో ఉండడడంతో మూడున్నర గంటలపాటు కేంద్ర మంత్రి కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారులు అంతా కలిసి కృషి భవన్లో వేచిచూసినట్టు చెప్పారు. కాగా అవసరమైతే ఫ్రధాని మోదీతో సమావేశం అయ్యెందుకు వేచి చూస్తున్నట్టు సమాచారం

  ఇది చదవండి  : ముగిసిన నామినేషన్ల పర్వం..ఎవరు ఏకగ్రీవం కానున్నారు..?


  కాగా వరి కొనుగోలుపై కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వానా కాలం సీజన్ నలబై లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయడంతోపాటు పెండింగ్ లో ఉన్న మరో అయిదు లక్షల టన్నుల బియ్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. కాగా బాయిల్డ్ రైస్ మినహా , రా రైస్‌ను కోనుగోలు చేస్తామని ఇప్పటికే కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. కాని టీఆర్ఎస్ మాత్రం కేంద్రంలో ఓ మాట రాష్ట్రంలో మరోమాటను బీజేపీ ( bjp ) నేతలు చెబుతుండడంతో స్పష్టత తీసుకువచ్చేందుకు డిల్లీ వెళుతున్నట్టు సీఎం కేసిఆర్ ( cm kcr ) ప్రకటించారు. కొనుగోలుపై తాడో పేడో తేల్చుకుని వస్తామని చెప్పారు. దీంతో మంత్రుల అపాయింట్ లేకపోయినా రెండు రోజుల పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలుతోపాటు నీటి సమస్యలపై వెంటనే తేల్చే విధంగా ఒత్తిడి తెచ్చే వ్యూహంతో టీఆర్ఎస్ ( TRS )మంత్రుల బృందం ఢిల్లీ వెల్లింది. అయితే మరో రెండు రోజులు వేచి చూస్తే గాని కేంద్రం నుండి ఎలాంటీ స్పష్టత వస్తుంది. మంత్రులు అధికారికంగా ఏం చెప్పారనేది తేలనుంది.

  ఇది చదవండి  : దారుణం.. మహిళపై అత్యాచారం, హత్య.. అది కూడా భర్త ముందే...అత్యాచారం .. ఆ తర్వాత హత్య 

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Delhi, KTR, Trs

  ఉత్తమ కథలు