Home /News /telangana /

TRS MINISTER JAGADISH REDDY SLAMS TS GOVERNOR TAMILISAI OVER DELHI PRESS MEET AMID RAJBHAVAN TUSSLE WITH CM KCR MKS

Telangana Governor: కేంద్రానికి దిమ్మతిరిగే పంచ్!.. KCRపై తమిళిసై విమర్శలు బూమరాంగ్ అయ్యాయా?

ప్రధాని మోదీతో టీ గవర్నర్ తమిళిసై భేటీ

ప్రధాని మోదీతో టీ గవర్నర్ తమిళిసై భేటీ

సేవా రంగానికి చెందని కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అనర్హుడైతే, మరి తమిళిసై ఏ రంగం నుంచి గవర్నర్ గా నామినేట్ అయ్యారు? అనే అర్థంలో టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటరిచ్చారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన క్రమంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం నాటి ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలను కలిసిన తర్వాత గవర్నర్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సర్కారును విమర్శించడంతో అదే స్థాయిలో ఆమెకు కౌంటర్లు ఇస్తున్నది గులాబీ దళం. ప్రధానంగా, కేంద్రంపై సీఎం ఆగ్రహానికి వరి వివాదం కంటే వ్యక్తిగత, రాజకీయ కారణాలే ఉన్నాయనే అర్థంలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతాన్ని గవర్నర్ తన ప్రెస్ మీట్ లో హైలైట్ చేయడంపై టీఆర్ఎస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి సేవా రంగానికి చెందినవాడు కాదు కాబట్టే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్ కు ఆమోదం తెలుపలేదన్న తమిళిసై వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..

వరి పోరులో భాగంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఈనెల 11న ఢిల్లీలో భారీ దీక్షను తలపెట్టింది. వారం ముందుగానే హస్తిన వెళ్లిన కేసీఆర్ వరిపోరుపై నాయకులకు నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఢిల్లీలో ఉండగానే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం నాడు కేంద్రం పెద్దలను కలిశారు. ఇవాళ(బుధవారం) తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. పీఎం మోదీతో భేటీ తర్వాత గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు తీరుపై ఆగ్రహం వెళ్లగక్కారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని హితవు పలుకుతూ, అసలు వివాదానికి కారణం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతమే అనే అర్థంలో మాట్లాడారు. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కేంద్రానికి దిమ్మతిరిగేలా కౌంటరిచ్చారు.

KCR విషయంలో కేంద్రం గేరు మార్చిందా? -PM Modiతో భేటీ తర్వాత గవర్నర్ సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి?


‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం సేవా రంగం నుంచి (కేసీఆర్)ప్రభుత్వం ఒక పేరును నాకు ప్రతిపాదించింది. అయితే అసలా వ్యక్తి(కౌశిక్ రెడ్డి) ఎలాంటి సేవా చేయలేదని నాకు తెలియవచ్చింది. ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. వ్యక్తిగతంగా నాకు ఈగో లేదు. వివాదాలు పడవు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ సీఎస్ కు ప్రోటోకాల్ తెలీదా?’అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గవర్నర్ ప్రెస్ మీట్ పై టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి ట్విటర్ లో స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన బైట్స్ ను మంత్రి షేర్ చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారాన్ని గవర్నర్ ఢిల్లీలో ప్రస్తావించడాన్ని మంత్రి జగదీశ్ తప్పుపట్టారు. గవర్నర్లను గౌరవించడంలో కేసీఆర్ ను మించిన సీఎం లేరనీ మంత్రి పేర్కొన్నారు.

CM KCR: పన్ను పీకించుకొని కేసీఆర్ తిరుగుటపా! -ఢిల్లీ వరి దీక్షకు సీఎం పక్కాగా వెళతారా?


పాడి కౌశిక్ రెడ్డి సేవారంగానికి చెందినవాడు కాదన్న వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. తమిళిసై గవర్నర్ గా నియామకం కావడానికి ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. సేవా రంగానికి చెందిన వ్యక్తిగా కౌశిక్ రెడ్డి పేరును నామినేట్ చేయడాన్ని మంత్రి సమర్థించుకున్నారు. ‘రాజకీయాల్లో ఉండడం కూడా సేవ చేయడమే. రాజకీయాలకు అతీతంగా ఉండేవాళ్ళని గవర్నర్లుగా నియమించాలని ఉంది. మరి, మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులను, సీఎంలను, మంత్రులను గవర్నర్లుగా ఎలా నియమిస్తారు?’అని ఎదురు ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. అంతేకాదు,

Telangana Governor: అమిత్ షాతో తమిళిసై భేటీ.. KCR తీరుపై ఫిర్యాదు?.. సీఎం ఢిల్లీలో ఉండగానే..


‘ఒక రాష్ట్ర ప్రభుత్వం గురించి గవర్నర్ ఢిల్లీలో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఎవరినైనా గౌరవించడంలో సీఎం కేసీఆర్ ను మించిన వాళ్లెవరూ లేరు. ఉద్యమం సమయంలో తెలంగాణ వ్యతిరేక ముద్రపడిన అప్పటి గవర్నర్ నరసింహన్ తో రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సఖ్యతగా ఉన్నాం’అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా సేవా రంగానికి చెందని కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అనర్హుడైతే, మరి తమిళిసై ఏ రంగం నుంచి గవర్నర్ గా నామినేట్ అయ్యారు? అనే అర్థంలో టీఆర్ఎస్ మంత్రి కౌంటరిచ్చారు. సీఎం వర్సెస్ గవర్నర్ ఉదంతం నేపథ్యంలో తెలంగాణ మరో బెంగాల్ గా మారనుందా? తరహా కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Governor Tamilisai, Ministers, Pm modi, Tamilisai Soundararajan, Telangana, Trs

తదుపరి వార్తలు