హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం.. వరి పోరాటానికి డైరక్షన్..

CM KCR : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం.. వరి పోరాటానికి డైరక్షన్..

CM KCR : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం ప్రారంభ‌మైంది. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

  తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం ప్రారంభ‌మైంది. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలు చేయడంతో పాటు వందశాతం ధాన్యం కొనుగోళ్లపై ఒత్తిడి తేచ్చేందుకు నేతలకు దిశనిర్ధేశనం చేయనున్నారు. దీంతో పాటు స్థానికంగా పోరు కొనసాగించేందుకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ నేతలు చేయాల్సిన అంశాలను సీఎం వివరించి వారికి ఆదేశాలు జారీ చేయనున్నారు.

  మరోవైపు సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. అవసరమైతే పీఎం అపాయింట్‌మెంట్ తీసుకుని సమస్యను చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి పక్క ప్లాన్‌తో ఢిల్లీ వెళుతున్న సీఎం ఆయా మంత్రుల అపాయింట్‌మెంట్‌లను ముందే తీసుకుని వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మూడు లేదా నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది.

  Yadadri : సింపుల్‌గా యాదాద్రి ప్రారంభోత్సవం..శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరుకు నిరాకరణ.. బదులుగా.. ?

  కాగా సీఎం అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజర‌య్యారు.

  First published:

  Tags: CM KCR, TRS leaders

  ఉత్తమ కథలు