రానున్న యాసంగితో పాటు గత ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామి ఇవ్వాలంటూ ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలు గత మూడు రోజులుగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు. కాగా నేడు ఆయనతో సమావేశయ్యారు. సుమారు గంటపాటు ఆయనతో సమావేశం అయిన టీఆర్ఎస్ నేతలు అనంతరం మీడియాతో సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అయితే ధాన్యం కొనుగోలుపై ఈ సారి కూడా కేంద్రం మొండి చేయి చూపించిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణపై కేంద్రాన్ని స్పష్టత కోరామని నిరంజన్ రెడ్డి చెప్పారు. దీంతో యాసంగిలో ధాన్యం కొనేది లేదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు ఆయన చెప్పారు.. మరోవైపు వానాకాలంలో 60 లక్షల టన్నులు కొనాలని లక్ష్యం నిర్దేశించారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 3 రోజుల్లో పూర్తి కానున్నట్టు చెప్పారు.. కాగా లక్ష్యానికంటే అధికంగా రాష్ట్రంలో కొనాల్సిన ధాన్యం ఇంకా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన వెళ్లడించారు.. మరో 5 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయని, ఆ ధాన్యం జనవరి 15వ తేదీ వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. మిగతా ధాన్యం సేకరించాలా? వద్దా? అని స్పష్టత కోరినట్టు చెప్పారు..
Amit shah : కేసిఆర్ ట్రాప్‌లో పడకండి... అమిత్ షా డైరక్షన్.. రెండు రోజులు రాష్ట్రంలో పర్యటన
దీంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? మూసివేయాలా? అని అడిగినట్టు ఆయన చెప్పారు...కొనుగోళ్లపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. అయితే టీఆర్ఎస్ నేతల వినతిపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు పీయూష్ గోయల్ రెండు రోజుల సమయం కావాలని కోరినట్టు చెప్పారు.. కాగా రెండు రోజులు కూడా ఢిల్లీలోనే ఉండి ఆ తర్వాత మరోసారి కలుస్తామని తెలిపారు. సేకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే రాష్ట్రానికి చేరుకుంటామని చెప్పారు.
కాగా అంతకుముందే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రమంత్రిని కలిశారు. ఈ సంధర్భంగా పియూష్ గోయల్ సైతం రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గత నాలుగు సంవత్సరాల్లో ఐదు రెట్లు ధాన్యం కొనుగోళ్లు పెంచామని, దీనికి తోడు నాలుగు సార్లు ధాన్యం సేకరణకు అవకాశం ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వరి ధాన్యం సేకరణ కోసం రాష్ట్రానికి అవకాశం ఇచ్చామని , కాని, విధించిన టార్గెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైస్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి చెప్పారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Paddy, TRS leaders