Home /News /telangana /

TRS LEADER GELLU SRINIVAS YADAV WHO CONTESTED ON ETELA RAJENDAR MAY GET NOMINATED POST SOON CM KCR TO DECIDE AK

Etela Rajendar: ఈటల రాజేందర్ ఎఫెక్ట్.. మరో టీఆర్ఎస్ నేతకు పదవి ఇవ్వనున్న కేసీఆర్

కేసీఆర్, ఈటల (పైల్ ఫోటో)

కేసీఆర్, ఈటల (పైల్ ఫోటో)

CM KCR-Etela Rajendar: హుజూరాబాద్‌ నేతలకు మంచి పదవులు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయొచ్చన్నది కేసీఆర్ వ్యూహం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    తెలంగాణలోని కొందరు నేతలకు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా పదవులు రావడానికి ప్రధాన కారణం మాజీమంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. అక్కడి నేతలు కొందరికీ కీలక పదవులు కట్టబెట్టింది. ఇందులో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి సహా పలువురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ ఈక్వెన్షన్స్‌ను బేరీజు వేసుకుని సీఎం కేసీఆర్ పలువురికి పదవులు ఇచ్చారని.. ఇటీవల నామినేటెడ్ పదవులు వచ్చిన పలువురు యువ నేతలు కూడా ఇలా పదవులు పొందిన వారే అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో నాయకుడికి సైతం ఇదే రకంగా పదవి రాబోతోందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తెరపైకి తీసుకొచ్చింది టీఆర్ఎస్.

    ఎవరూ ఊహించని విధంగా ఈటల రాజేందర్‌పై గెల్లును పోటీలో నిలిపింది. ఉద్యమంలో పని చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈటలకు గట్టి పోటీ ఇస్తాడని గులాబీ బాస్ భావించారు. కానీ ఫలితం మాత్రం మరో విధంగా వచ్చింది. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈటల రాజేందర్‌ను ఓడించలేకపోయిందనే చర్చ తెలంగాణలో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇటీవల ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురికి సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు.

    నాయకులకు ఓపిక ఉండాలని.. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి కచ్చితంగా పదవులు వస్తాయని ఇటీవల జరిగిన పార్టీ నేతలు సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో త్వరలోనే పదవులు రాబోయే నాయకుల జాబితాలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న వారికే కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

    cm kcr announces gellu srinivas yadav as trs candidate, huzurabad trs candidate gellu srinivas yadav, who is gellu srinivas yadav, gellu srinivas yadav in huzurabad, huzurabad by election news, huzurabad bypoll news, హుజూరాబాద్ ఉపఎన్నికలు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, <a href='/tag/telangana/'><h5 class=తెలంగాణ రాజకీయాలు" width="1200" height="800" /> సీఎం కేసీఆర్‌తో గెల్లు శ్రీనివాస్


    ఇందులో భాగంగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌పై పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కూడా నామినేటెడ్ పోస్టు కోసం ఎంపిక చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. ఆయన పేరును నామినేటెడ్ పోస్టు కోసం దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌పై పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పక్కనపెట్టి.. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ పదవి ఇచ్చిందనే అపవాదును తుడిచేందుకు కూడా ఈ నిర్ణయం పనికొస్తుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

    Telangana Congress: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

    Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీకి మాజీమంత్రి ప్లాన్.. టీఆర్ఎస్ కాదంటే ఆ గుర్తుపైనే పోటీ

    హుజూరాబాద్‌ నేతలకు మంచి పదవులు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయొచ్చన్నది కేసీఆర్ వ్యూహం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పదవి వస్తే.. అది కచ్చితంగా ఈటల రాజేందర్ ఎఫెక్ట్ అనే చర్చ జరగడం ఖాయమే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు