TRS : టీఆర్ఎస్‌కు మరో నేత షాక్.. రాజీనామా చేస్తున్నట్టు సీఎంకు లేఖ ..

ప్రతీకాత్మక చిత్రం

TRS : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓవైపు ఏకగ్రీవంగా అభ్యర్థులు గెలుపువైపు కొనసాగుతుంటే ఆ పార్టీకి కొంతమంది గుడ్‌బై చెప్పేందుకు సిద్దమయ్యారు.

  • Share this:
    టీఆర్ఎస్ ( TRS )పార్టీకి గట్టు రాంచందర్ రావు రాజీనామా ( Gattu Ramchanderrao ) చేశారు. అధికార పార్టీలో ఉండి రాజీనామా చేయడంతో సంచలనంగా మారింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సగం స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకి కూడా సరైన బలం లేకపోవడంతో రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పోటి చేస్తుండగా ఇక బీజేపీ పూర్తిగా ఎన్నికల్లో పోటికి దూరంగా ఉంది.

    అయితే ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సర్ధార్ రవీందర్ సింగ్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో పార్టీలో అసమ్మతి రాగం బయటపడింది. తాను నిజమైన ఉద్యమ కార్యకర్తనని తేల్చి చెప్పడంతో పాటు బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

    ఇది చదవండి : లక్షలు ఖర్చు పెట్టిన దక్కని ప్రియురాలి ప్రేమ.. ఫేస్‌బుక్ లైవ్.. తో యువకుడు ఆత్మహత్య...


    ఇలాంటీ సమయంలోనే మరోపార్టీ సీనియర్ నేత గట్టు రాంచందర్ రావు టీఆర్ఎస్ కురాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు. ( Gattu Ramchanderrao resign to trs ) ఈ సంధర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.. లేఖలో “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఆమోదిస్తారని ఆశిస్తున్నాను.. ఇప్పటి వరకు నన్ను గౌరవించిన మీకు, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

    ఇది చదవండి : ముగిసిన విత్ డ్రా సమయం.. సగం స్థానాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం


    కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన గట్టు రాంచందర్ రావు రాజకీయ ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీలో ఎక్కువ కాలం పని చేశారు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. ప్రస్తుత సీఎం జనన్‌మోహన్ రెడ్డి కోసం తీవ్రంగా పోరాడిన ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత వైఎఎస్ఆర్ సీపీ నుండి టీఆర్ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక తాజాగా టీఆర్ఎస్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. అయితే గట్టు రాంచందర్ రావు పెద్దగా ప్రజా బలం లేకపో( Gattu Ramchanderrao resign to trs ) యినా అనేక సంఘాలతో పాటు పార్టీల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభం ఉంది.

    ఇది చదవండి : ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట.. ఫిదా అయిన ఎండీ సజ్జనార్..కానుకగా..


    ..
    Published by:yveerash yveerash
    First published: