Bandi Sanjay: ఆ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం.. మండిపడ్డ బండి సంజయ్

Bandi Sanjay on Cm Kcr: ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: August 20, 2020, 6:32 PM IST
Bandi Sanjay: ఆ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం.. మండిపడ్డ బండి సంజయ్
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గణేశ్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించేందుకు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉత్సవ నిర్వాహకులపై పోలీసులతో కేసీఆర్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. లోపాయికారి అవగాహనతో కలిసి కుట్రలు చేస్తున్న టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్ మాసంలో బిర్యానీలు, కాజు పిస్తాలు అందించిన టిఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం గణేష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించకుండా కఠిన కుట్రలు చేస్తోంది. ఆంక్షలు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ సమయంలో ధార్మిక సంస్థలు,హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైతే స్థానిక హిందూ ధార్మిక సంస్థలను, బిజెపిని సంప్రదించాలని తెలిపారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వ చర్యలను బిజెపి దీటుగా ఎదుర్కొంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: August 20, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading