హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆ నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: ఆ నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Government: నిన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకమైన వీడియోలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ఆ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని(Telangana) అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర కూడా భద్రత పెంచింది. కొద్దిరోజుల క్రితం మెయినాబాద్‌ సమీపంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌజ్‌లో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వాళ్లు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఏయే విషయాలు చెప్పారనే దానిపై గతంలో రెండు ఆడియో టేపులు బయటకు రాగా.. నిన్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలను మీడియా ముందు విడుదల చేశారు సీఎం కేసీఆర్ . వాటిని మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల హైకో్ర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపుతున్నానని.. వాళ్లే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు.

అయితే ఫామ్ హౌస్ ఘటన తరువాత నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వం అధీనంలోనే ఉన్నారనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సభకు సీఎం కేసీఆర్ వారిని తీసుకెళ్లారు. నిన్నటి మీడియా సమావేశంలోనూ వారిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఈ నలుగురు ఎమ్మెల్యేలే కీలకం కావడంతో.. వీరికి తెలంగాణ ప్రభుత్వం భద్రతను మరింతగా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Trs MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఆడియో, వీడియోల బహిర్గతంపై తెలంగాణ హైకోర్టు ఆరా

Kishan Reddy: అందమైన అబద్దం ఆ వీడియో..కేసీఆర్ ప్రెస్ మీట్ పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ విడుదల చేసిన వీడియోలపై బీజేపీ స్పందించింది. ఆ వీడియోలు టీఆర్ఎస్ సృష్టి.. వాటితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

First published:

Tags: Telangana

ఉత్తమ కథలు