హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By election Result: దుబ్బాకలో తొలిసారి టీఆర్ఎస్‌కు ఆధిక్యం.. ఆరో రౌండ్‌లో..

Dubbaka By election Result: దుబ్బాకలో తొలిసారి టీఆర్ఎస్‌కు ఆధిక్యం.. ఆరో రౌండ్‌లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By election Result: తొలి ఐదు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మెజార్టీ రావడంతో... అన్ని రౌండ్లు ఇదే రకంగా ఉంటాయేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆరో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరిచింది.

  దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలి ఐదు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మెజార్టీ రావడంతో... అన్ని రౌండ్లు ఇదే రకంగా ఉంటాయేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆరో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరిచింది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 353 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యం 2667 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆరో రౌండ్ ముగిసేసరికి మొత్తంగా బీజేపీకి 20226 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 17559 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలోఉన్న కాంగ్రెస్ 3254 ఓట్లతో సరిపెట్టుకుంది.

  ఇక ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఆధిక్యత రావడం వెనుక అసలు కారణంగా టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత సొంత గ్రామం చిట్టాపూర్ ఓట్లను ఇదే రౌండ్‌లో లెక్కించడమే అని బీజేపీ భావిస్తోంది. అయితే సుజాత సొంత గ్రామంలోనూ బీజేపీ ఆశించిన దానికంటే మెరుగైన స్థాయిలో ఓట్లు సాధించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాబోయే నాలుగు రౌండ్లలో మిర్‌దొడ్డి మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కింపు ఉంటుందని.. దీంతో అక్కడ తమ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. మిర్‌దొడ్డి ప్రాంతంలో ఎక్కువ గ్రామీణ ఓటర్లు ఉండటంతో.. అక్కడ తమకు ఆధిక్యత ఉంటుందని భావిస్తోంది.

  14 టేబుళ్ల మీద 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎవరు గెలుస్తారనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు