Home /News /telangana /

TRS GETTING READY TO SUSPEND ETELA RAJENDAR FROM PARTY AFTER KARIMNAGAR LEADER WROTE LETTER TO CM KCR AK

Etela Rajendar: ఈటల రాజేందర్‌కు మరో షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

Etela Rajendar: ప్రభుత్వం, అధికార పార్టీపై ఈటల రాజేందర్ విమర్శలు చేస్తుండటంతో.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    అవినీతికి పాల్పడారనే ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రభుత్వం, అధికార పార్టీపై ఈటల రాజేందర్ విమర్శలు చేస్తుండటంతో.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతల తీర్మానం చేయడం ఈ వాదనకు ఊతమిస్తోంది. ఈటల వ్యవహారంపై చర్చించేందుకు సమావేశమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు.. ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తదితరులు సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వివాదం వ్యవహారంలో ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్‌ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్‌ పిటిషన్‌లో కోరింది. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్‌లో పేర్కొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు