Home /News /telangana /

TRS FIRES ON MADHYAPRADESH CM SHIVARAJSINGH CHAUHAN VRY

TRS on MP CM : ఆయన చౌహాన్ కాదు ఓ చోర్.. బీజేపీ అంటే బేరగాళ్ళు- జూటగాళ్ళ లెక్క

harish rao file photo

harish rao file photo

TRS on MP CM : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఒక సీఎం అయి ఉండి మరోసీఎంను విమర్శించడంపై వారు మండిపడ్డారు.

    బీజేపీ ,టీఆర్ఎస్‌ వార్ పీక్ స్టేజికి చేరింది. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ పకడ్బందీ వ్యుహామే రచిస్తోంది. బండి సంజయ్‌పై కేసులు ఆ తర్వాత జరిగిన జేలు పరిణామాల తర్వాత రెండు పార్టీల మధ్య మరింత మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకుంటుంది. ఇందుకోసం జాతీయ నేతలతో పాటు ఏకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రలతో పాటు సీనియర్ పార్టీనేతలను రంగంలోకి దింపుతోంది.

    ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటీ నేతలు రాష్ట్రంలో బండి సంజయ్‌ అరెస్ట్ పై స్పందించారు. ఆ తర్వాత చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను తీసుకువచ్చారు. కాగా శుక్రవారం సైతం బండి సంజయ్ జైలు వెళ్లివచ్చిన తర్వాత ఆయన కరీంనగర్ నుండి హైదరాబాద్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సంధర్భంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను మోహరించడంతో పాటు ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రంగంలోకి దింపారు.

    ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన పాల్గోని ముఖ్యమంత్రి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో ప్రధానం కాళేశ్వరం ఏటిఎం ప్రాజెక్టుగా మారిందన్న వ్యాఖ్యలపై ఆయన దృష్టి సారించారు. సీఎం పాలనపై ఆయన మండిపడ్డారు. కాగా ఒక సీఎం మరోరాష్ట్రానికి వెళ్లి రాజకీయ విమర్శలు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.

    Vanama Raghava : వనమా రాఘవకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ .. వెంటవెంటనే పరిణామాలు..!


    ఈ క్రమంలోనే ఆయన ఒక డమ్మి సీఎం అని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చడని పార్టీ నేతలు విమర్శించారు. ఆయన హాయంలోనే అనేక వ్యాపం కుంభకోణం ఆయన హయాంలోనే జరిగిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పచ్చకామెర్ల ముఖ్యమంత్రికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఇక 317 జీవో రద్దు చేయలంటూన్న బీజేపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. అలా చేస్తే.. రాష్ట్రపతి ఉత్తర్వులను సైతం రద్దు చేయాల్సి ఉంటుందని అన్నారు.

    Rape and murder : ప్రేమికురాలిని ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య.. అసలేం జరిగిదంటే..


    మరోవైపు ఆపార్టీ నేతుల ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్ పై మండిపడ్డారు. ఆయన చౌహన్‌గా కాకుండా చోర్‌గా మారాడని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలు మారినా స్క్రిప్టు మాత్రం ఒక్కటేనని మండిపడ్డారు. ఎంపీలో ఒక్కటైనా కాళేశ్వరం లాంటీ ప్రాజెక్టు ఉందా అని నిలదీశారు. ఇక సీఎం కేసిఆర్ ఎప్పటికి ప్రజల ఏటిఎం అంటూ కితాబిచ్చారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Telangana bjp, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు