• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TRS EX MP TWEET ABOUT PRANAB MUKHERJEE HEALTH AND DELETED IMMEDIATELY SK

తొందరపడిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ.. ట్వీట్ చేసి వెంటనే డిలీట్

తొందరపడిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ.. ట్వీట్ చేసి వెంటనే డిలీట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు.

  • Share this:
    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారు. అది నిజమని భావించిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తొందరపడ్డారు. ప్రణబ్ ముఖర్జీ గురించి ఓ ట్వీట్ చేశారు. ఐతే ప్రణబ్ ఆరోగ్యం గురించి ఆయన కూతురు షర్మిష్ట క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. ఆయనకు చికిత్స కొనసాగుతోందని వదంతులను నమ్మవద్దని సూచించారు. దాంతో పొరపాటును తెలుసుకున్న బూర నర్సయ్యగౌడ్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఐతే అప్పటికే కొంత మంది స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

    బూర నర్సయ్య ట్వీట్


    ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ అన్ని పార్టీల నేతలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు