Home /News /telangana /

TRS DOUBLE ATTACK ON CENTRAL GOVT PROTEST AGANIST PETRO HIKES TODAY VRY

Telanagana : ఢిల్లీలో ధాన్యం.. గల్లీలో గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ పోరు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

Telanagana : పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగనున్నాయి. నేరుగా సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టనున్నారు.

    కేంద్రంపై రెండు వైపుల టీఆర్ఎస్ రెండువైపుల దాడి కొనసాగిస్తోంది.ఓవైపు ఢిల్లీలో ధాన్యం కొనుగోలు మరోవైపు గల్లీలో పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరలకు నిరసనగా పార్టీ నేతలు ధర్నాల్లో పాల్గోననున్నారు. ముఖ్యంగా నేరుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గోని ఆందోళనలను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.

    ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నగరంలోని బేగం పేట సివిల్ సప్లై కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇక నియోజకవర్గాల్లో సైతం ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు.ఇదిలా ఉంటే అటు ధాన్యం కోనుగోలుపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలవనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయనతో సమావేశం కానున్నారు.పంజాబ్ మాదిరిగా తెలంగాణలో సైతం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ మంత్రుల బృందం నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్‌లు ఢిల్లీ చేరుకున్నారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ అనే నినాదంతో తెలంగాణలో సైతం మిగతా రాష్ట్రాల వలే ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bjp, Telangana, Trs

    తదుపరి వార్తలు