హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : కరీంగనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు షాక్.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మాజీ మేయర్

Karimnagar : కరీంగనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు షాక్.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మాజీ మేయర్

అయితే, ఇటీవలే TRS పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. జిల్లాలో 1,324 మంది ఓటర్లు ఉండగా ఇందులో TRS నేతలు 996 మంది. ఇక ఉమ్మడి ఖమ్మంలోని ఒక స్థానానికి TRS, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు ఇండిపెండెంట్లు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మంది ఓటర్లలో TRSకు 490, కాంగ్రెస్‌కు 116 ఓట్లు ఉన్నాయి.

అయితే, ఇటీవలే TRS పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. జిల్లాలో 1,324 మంది ఓటర్లు ఉండగా ఇందులో TRS నేతలు 996 మంది. ఇక ఉమ్మడి ఖమ్మంలోని ఒక స్థానానికి TRS, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు ఇండిపెండెంట్లు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మంది ఓటర్లలో TRSకు 490, కాంగ్రెస్‌కు 116 ఓట్లు ఉన్నాయి.

Karimnagar : స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడే అధికార పార్టీకి షాక్‌ తగిలింది... ఆ పార్టీ కార్పోరేటర్ , మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ జిల్లాలో ఇండింపెండెంట్‌గా నామినేషన్ ధాఖలు చేశారు.

కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పోరేటర్ , మాజీ అయిన సర్థార్ రవీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్‌ఎస్ వెంట ఉన్న రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంతో పార్టీ నేతల్లో టెన్షన్ వాతవరణం నెలకొంది.

నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో కరీంనగర్ జిల్లా నుండి ఇటివల పార్టీలో చేరిన మాజీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, మరో ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌ రావుకు సీఎం కేసిఆర్ అవకాశం కల్పించారు. అయితే గత కొద్ది రోజులుగా రవీందర్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న 12 మంది స్థానాలకు గాను అందులో 7గురు పాతవారికే సీఎం కేసిఆర్ అవకాశం కల్పించగా మరో అయిదుగురు కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

ఇది చదవండి  : కారు నుజ్జు,నుజ్జు ఇద్దరు యువకుల మృతి..


మరోవైపు ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతోనే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలోనే పలు జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఎన్నికల ప్రలోభాలకు తెరలేచింది. దీంతో నామినేషన్స్ వేసిన అభ్యర్థులు అప్పుడే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఇప్పటికే.. తమకు సరైన నిధులు , ప్రాతినిధ్యం , ప్రాధాన్యం దక్కడం లేదని ఎంపీటీసీలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు , జెడ్పీటీసీలు , కార్పొరేటర్లు , కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించారు. కాగా కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు సిద్దమయిన నేపథ్యంలోనే వారిని అడ్డుకునే పనిలో పడ్డారు..నామినేషన్ల ప్రక్రియకు ముందే నామినేషన్లు వేయకుండా బుజ్జగింపు రాజకీయాలు చేశారు.

ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఉమ్మడి జిల్లా నేతలందరూ మంగళవారం ఉదయం 10 గంటల కల్లా కరీంనగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు సూచించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి నాలుగు రోజులు హైదరాబాద్ పరిసరాల్లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది . ఆ తర్వాత వేరే ప్రాంతానికి తరలించి అక్కడ నాలుగు రోజులు అయిన తరువాత మరో చోటకు తరలించేందుకు కూడా స్కెచ్ సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇకపోతే క్యాంపులకు తరలిస్తున్న స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు తమ వెంట మొబైల్స్ తీసుకురాకూడదని సూచిస్తున్నారు . వారి వారి కుటుంబ సభ్యులతో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఫోన్ లో మాట్లాడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు . మొత్తం పదిహేను రోజుల పాటు క్యాంపు రాజకీయాలను నడిపి ఆ తర్వాత ఎన్నికల పోలింగ్ జరిగే డిసెంబర్ 9 నేరుగా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

సో మొత్తం మీద గతంలో చాలా స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార పార్టీకి, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కొంత ఫైట్ చేయక తప్పే పరిస్థితి కనిపించడం లేదు.. ఇక స్థానిక సంస్థల్లో బలం లేని బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో పోటి చేయకుండా తప్పుకుంటున్నట్టు ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మెదక్‌తోపాటు మరో రెండు చోట్ల పోటి చేసేందుకు సమాయత్తమవుతోంది. దీంతో చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి సీట్లు దక్కనున్న కొంత ఉత్కంఠ మాత్రం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Karimnagar, Telangana mlc election

ఉత్తమ కథలు