TRS CORPORATER SARDAR RAVINDAR SING MEETS CM KCR AT PRAGATHIBAVAN VRY KNR
Sardar Ravindar sing : మారిన రాజకీయం.. సీఎంతో భేటి అయిన.. సర్ధార్ రవీందర్ సింగ్..
CM KCR
Sardar Ravindar sing : సర్ధార్ రవీందర్ సొంత గూటికి చేరాడు..స్వయంగా సీఎం కేసీఆర్ చొరవతో ఆయన
పార్టీలోకి రీ ఎంటర్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు సిక్కు సామాజిక నేతలతో కలిసి నేరుగా సీఎం
కేసిఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు.
కరీంనగర్ రాజకీయాల్లో హల్చల్ చేసిన సర్ధార్ రవీందర్ సింగ్ తిరిగి సొంత గూటికి చేరాడు.. అదికూడా కొద్ది రోజుల్లోనే సీంఎం కేసిఆర్‌ను ప్రసన్నం చేసుకున్నాడు. సిక్కు సామాజిక నేతలతో కలిసి సీఎంను కలిశాడు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక సంస్థలలో నెలకొని సమస్యలు మరియు సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోయమని, అన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపాడు.. రానున్న రోజులలో అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుద్దామని కేసీఆర్ హామి ఇచ్చినట్టు ఆయన తెలిపాడు.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పోటీచేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా కొరుతున్నా అవకాశం రాకపోవడంతో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటి చేశాడు. చివరకు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.కాగా రవీందర్ సింగ్‌కు ఈటల రాజేందర్ మద్దతు పలికినట్టు బహిరంగగానే ఆయన ప్రకటించారు. కాని ఆయనకు ఆశించిన మేర ఓట్లు రాకపోవడంతో పాటు టీఆర్ఎస్ నేతలు క్యాంపు రాజకీయాలు నెరపడంతో అపజయం పాలయ్యాడు. అయితే రవీందర్ సింగ్ బీజేపీలోకి వెళతాడని భావించినప్పటికి అక్కడ ఎంట్రీ లభించకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరినట్టు సమాచారం.
సర్దార్ రవీందర్ సింగ్ గారి వెంట నాయకులు సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్, మరియు సిక్కు సమాజిక వర్గం నాయకులు ఎక్బల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్ సింగ్, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.