హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR| CNOS Survey : అసంతృప్తి ఉన్నా కేసీఆర్‌కు తగ్గని ప్రజాదరణ.. జాతీయ సర్వేలో 11వ ర్యాంక్

CM KCR| CNOS Survey : అసంతృప్తి ఉన్నా కేసీఆర్‌కు తగ్గని ప్రజాదరణ.. జాతీయ సర్వేలో 11వ ర్యాంక్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు నెలకొన్న వేళ వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతుండగా ప్రఖ్యాత సీఎన్‌ఓఎస్‌ సర్వే రిపోర్టు వెల్లడైంది. అసంతృప్తి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కు ప్రజాదరణ తగ్గలేదని సర్వే రిపోర్టులో పేర్కొన్నారు..

ఇంకా చదవండి ...

దేశంలోనే అతిపిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో తెలంగాణ (Telangana)ను అగ్రగామిగా నిలబెట్టామని అధికార టీఆర్ఎస్ (TRS) చెప్పుకుంటోంటే, రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న జాతీయ పార్టీ బీజేపీ (BJP) మాత్రం కల్వకుంట్ల కుటుంబం అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్నది. కేంద్రం వర్సెస్ తెలంగాణ, సీఎం కేసీఆర్ వర్సెస్ పీఎం మోదీ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయ పోరుతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందోననే చర్చ కొనసాగుతోన్న క్రమంలో అసంతృప్తి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ (CM KCR)కు ప్రజాదరణ తగ్గలేదని కీలక సర్వేలో వెల్లడైంది..

ప్రఖ్యాత సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపినియన్‌ సర్వే (సీఎన్‌ఓఎస్‌) సంస్థ.. ప్రజాదరణ కలిగిన పాలకులు ఎవరనే అంశంపై భారీ సర్వే (CNOS surveyనిర్వహించింది. ప్రధాని మోదీతోపాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్‌వోఎస్‌ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్యస్థంగా 11వ స్థానంలో నిలిచారు. అయితే ఆయన నాయకత్వానికి అప్రూవల్ రేటింగ్ మెరుగ్గా ఉండటం గమనార్హం.

President poll 2022: ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్య! -నఖ్వీకి ఆర్ఎస్ఎస్ నో? -రేసులో తమిళిసై


సీఎన్‌ఓఎస్‌ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ప్రజాదరణ కలిగిన సీఎంల జాబితాలో కేసీఆర్‌ 11వ స్థానంలో నిలవగా, ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. అయితే కేసీఆర్ పై 19 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మాత్రం అనూహ్యంగా దిగువన 20వ స్థానంలో నిలవడం గమనార్హం.

CM Jagan | CNOS Survey : జనాదరణలో జగన్ ఢమాల్.. జాతీయ సర్వేలో 20 స్థానంలో ఏపీ సీఎం


దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా.. 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో జనాదరణ పొందిన మొదటి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నవీన్‌ 51 పాయింట్ల నికర ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తరప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర-ఇటీవలే రాజీనామా చేశారు), హిమంత బిశ్వ శర్మ (అసోం), భగవంత్‌సింగ్‌ మాన్‌ (పంజాబ్‌) నిలిచారు. ఇంకా..

India Population : అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. కొద్ది రోజుల్లోనే చైనాను దాటేస్తున్నాం..


ఏపీ సీఎం జగన్‌ తర్వాత అట్టడుగున నిలిచిన సీఎంలలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), బసవరాజ్‌ బొమ్మయ్‌ (కర్ణాటక), నీఫూ రియో (నాగాలాండ్‌), ప్రమాద్‌ సావంత్‌ (గోవా), మాణిక్‌ సాహా (త్రిపుర) ఉన్నారు. సీఎన్‌వోఎస్‌ తాజా సర్వే ప్రకారం ప్రధాని మోదీకి ప్రజాదరణ స్వల్పంగా పెరిగింది. గతంతో పోలిస్తే నికర ఆమోదం రేటింగ్‌ 36 పాయింట్లకు చేరుకుంది. దేశంలో 54 శాతం మంది ఆయన నాయకత్వాన్ని ఆమోదించారు. 18 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Survey, Telangana, Telangana News, Trs

ఉత్తమ కథలు