Home /News /telangana /

TRS CM KCR SON MINISTER KTR WHATSAPP STALLED DUE TO BULK MESSAGES SPAM ISSUES TS IT MINISTER CALLS IT DIGITAL CHALLENGES MKS

KTR | WhatsApp : కేటీఆర్‌కు‌ స్పామ్ షాక్.. ఐటీ మంత్రి వాట్సాప్ అకౌంట్ బ్లాక్.. చివరికి..

కేటీార్ వర్క్ ఫ్రమ్ హోం

కేటీార్ వర్క్ ఫ్రమ్ హోం

మోసపూరిత కాల్స్, మెసేజ్ లను నివారించేందుకు వాట్సాప్ సంస్థే స్పామ్ నంబర్స్ ను బ్లాక్ చేస్తోంది. విచిత్రంగా తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సాప్ నంబర్ స్పామ్ లిస్టులో పడి.. బ్లాక్ అయింది..

మనకు అవసరం లేకపోయినా ఆయా కంపెనీలు, కాల్ సెంటర్ల నుంచి అవాంఛితంగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదా.. ఇలా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు వెళ్లే సందేశాలను ‘స్పామ్’ (మోసపూరిత సందేశాలు లేదా కాల్స్) అంటారని మనకు తెలిసిందే. స్పామ్ బెడదను తప్పించడానికి వాట్సాప్ లాంటి కంపెనీలు తీవ్రంగా కసరత్తు చేస్తుంటాయి. ట్రూకాలర్ అధ్యయనం ప్రకారం ఒక్కో భారతీయుడికి నెలకు కనీసం 20 స్పామ్ కాల్స్ వస్తుంటాయి. దీన్ని బట్టే ఇదెంత తలనొప్పి వ్యవహారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేసే ఆప్షన్ కొన్ని యాప్స్ లో ఉన్నా, కాల్స్ రావడాన్ని మాత్రం నిషేధించలేని పరిస్థితి. దీంతో వాట్సాప్ సంస్థే స్పామ్ నంబర్స్ అని అనుమానం వస్తే వాటిని బ్లాక్ చేస్తోంది. విచిత్రంగా తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సాప్ నంబర్ స్పామ్ లిస్టులో పడి.. బ్లాక్ అయింది..

అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంతలో అందరికీ టచ్ లో ఉంటారు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌. అయితే గడిచిన కొద్ది గంటల్లో ఆయన వాట్సాప్‌ అకౌంట్‌ నిలిచిపోయింది. సోమవారం ఒక్కరోజే కేటీఆర్ వాట్సాప్‌ నెంబర్‌కు 8వేలకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ‘స్పామ్‌’ పేరుతో ఆయన ఖాతాను వాట్సాప్ సంస్థ బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

KCR | Droupadi Murmu : కొత్త రాష్ట్రపతిని కలిసే తొలి సీఎం! ఢిల్లీలో కేసీఆర్ వ్యూహాత్మక పర్యటన


తన వాట్సాప్‌ ఖాతా 24 గంటల నుంచి పనిచేయడం లేదని, వేలాది మెసేజ్ ల కారణంగా స్పామ్ గుర్తింపు వల్ల ఇలా జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, నంబర్ వాడేది ఎవరేంటని వాట్సాప్ గుర్తించలేకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ డిజిటల్ ఛాలెంజెస్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించారాయన.



ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఈ నెల 23న కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆయన ఎడమకాలికి గాయమైంది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అభిమానులు, పార్టీ నేతలు ఆయనకు మెసేజ్‌ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సందేశాలు వెల్లువెత్తడంతో అకౌంట్‌ నిలిచిపోయింది. కాగా, గాయంతో ఇంటికే పరిమితమైన కేటీఆర్‌ తన శాఖల ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ‘ఫైళ్ల పని కొంత పూర్తయింది’ అంటూ ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. తాను ఫైళ్లను పరిశీలిస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: KTR, Minister ktr, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు