Home /News /telangana /

TRS CM KCR RETURNS HYDERABAD AFTER 6 DAY DELHI TOUR AMID CENTER CURBS ON TELANGANA BORROWINGS MKS

CM KCR : గండం గట్టెక్కేనా? ఉద్యోగులకు సకాలంలో జీతం అందేనా? ఢిల్లీలో కేసీఆర్ ఏం చేశారు?

సీఎం కేసీఆర్ పాత ఫొటో

సీఎం కేసీఆర్ పాత ఫొటో

ఆగస్టు చెల్లింపులకు ముందే జులై చివరి వారంలో నిధుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరు రోజుల హస్తిన పర్యటన ముగించుకొని సీఎం ఆదివారం హైదరాబాద్ తిరిగొస్తున్నారు. వివరాలివే..

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు, ఇతర నిధులు, అప్పులపై కేంద్రం కొత్తగా విధించిన ఆంక్షల విషయంలో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ తన ఆరు రోజుల పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్ రానున్నారు. (Telangana CM KCR Delhi Tour Ends) అయితే సీఎం కేసీఆర్ టూర్ విశేషాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందే విషయంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. ఆసరా ఇతర ఫించన్లు సైతం ఆలస్యంగా అందుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ జాప్యం చోటు చేసుకుంటుందనే ప్రచారం సర్వత్రా ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చెల్లింపులకు ముందే జులై చివరి వారంలో నిధుల కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈనెల 25న(సోమవారం) హస్తిన వెళ్లిన సీఎం ఆరు రోజులపాటు అక్కడే మకాం వేసి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలతోపాటు జాతీయ స్థాయి రాజకీయ అంశాలపైనా విస్తృత సమావేశాలు, భేటీలు నిర్వహించిన ఆయన ఆదివారం (జులై 31) సొంత రాష్ట్రానికి తిరిగొస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. కొత్త రాష్టపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని, వీలును బట్టి కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ముర్మును కలవకుండానే కేసీఆర్ హైదరాబాద్ తిరిగొచ్చేస్తుండం గమనార్హం.

TRS | SP : సైకిల్‌తో కారు సవారీ -జోడు కట్టిన ఇద్దరు నేతలు.. ఇక జాతీయ పార్టీలుగా..


టీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించే దిశగా సమాలోచనలు, భావసారూప్యత, కలిసివచ్చే మిత్రులతో చర్చలతోపాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్యులతోనూ కేసీఆర్ ఢిల్లీలో విస్తృత సమావేశాలు జరిపారు. అయితే, తెలంగాణ ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి కేంద్రం పెద్దలు లేదా అధికారులను సీఎం కలిశారా లేదా అనేది అధికారికంగా వెల్లడికాలేదు.

Gold Silver Rates: స్థిరంగా బంగారం.. వెండి ఇంకాస్త ప్రియం.. నేటి ధరలు ఇలా..


రాష్ట్రంలో ఉద్యోగులకు నెల జీతాలు ఆలస్యం అవుతుండటం, పెన్షన్ల పంపిణీ కూడా నిదానంగా సాగుతున్న క్రమంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇబ్బందుల కారణంగా జులైలోనూ ఉద్యోగులకు వారం నుంచి మూడు వారాలు ఆలస్యంగా జీతాలు క్రెడిట్ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలలోనైనా జీతాల గండం గట్టెక్కేనా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేనా? అనే చర్చ జరుగుతోంది.ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో భేటీ కావడం, రెండు పార్టీలూ జాతీయ స్థాయికి విస్తరించాలని, కీలక అంశాల్లో కలిసి నడవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఇక శనివారం నాడు సీఎం.. జాతీయ స్థాయి రైతు సంఘాల నేతలు, జాతీయ మీడియా ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

Telangana: బండి సంజయ్​ లెక్క.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS​ కు ఎన్ని స్థానాలు వస్తాయంటే.. ?


దేశవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, పార్లమెంట్ లో అన్నదాతలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తామని రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. పంటలన్నిటికీ మద్దతు ధరలు, ఇతర అంశాలపై సమగ్ర విధానంతో కూడిన జాతీయ స్థాయి రైతు అజెండా రూపకల్పనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించామని వారికి వివరించారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా జరిగిన ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్ కు రైతు సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వివిధ జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. రాత్రి 10 గంటల వరకు పలు అంశాలపై వారితో చర్చించారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Delhi, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు