Home /News /telangana /

TRS CM KCR MAY TAKE DECISION ON TAXES AND ASSEMBLY SESSION AS CENTRE REFUSED TELANGANA BORROWINGS MKS

CM KCR | Centre : కొత్త అప్పులకు కేంద్రం అడ్డు.. ఆర్థిక దుస్థితిపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు!

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

తెలంగాణ కొత్త అప్పులు, ఇతర మార్గాల్లో రుణ సమీకరణకు కేంద్రం, ఆర్బీఐ నిరాకరించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పన్నులు పెంపు, కేంద్రంపై పోరు తదితర అంశాలపై కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
తెలంగాణ ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిందంటూ, కొత్త అప్పులపై కేంద్రం, ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో రాష్ట్రానికి రుణ సమీకరణ కష్టంగా మారింది. (Centre's Bar On Telangana Barrowings) కనీసం ప్రభుత్వ బాండ్లను విక్రయించుకునేందుకు కూడా వీలు లేకపోవడంతో సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక రాష్ట్ర ఆర్థిక శాఖ ఉక్కిరిబిక్కిరవుతోంది.

రుణ సమీకరణకు అనుమతి పొందేలా తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినా, అటు నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే ఆపేసి కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేయడానికి కారణం కూడా అప్పుల వ్యవహారమేనని తెలిసింది.

CM KCR : సీఎం కేసీఆర్ అనూహ్యం.. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే అర్దాంతరంగా హైదరాబాద్‌కు.. కారణమిదే..


పన్నుల పెంపు?: తెలంగాణలో నిర్మితమైన, ఇంకా నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులు, ఇతరత్రా స్కీముల కోసం పలు రుణ సంస్థల నుంచి కేసీఆర్ సర్కారు భారీ ఎత్తున అప్పులు చేయడం తెలిసిందే. అయితే, కేంద్రం తాజాగా‘ఆఫ్‌ బడ్జెట్‌’(ప్రభుత్వ సంస్థలు గ్యారంటీ అప్పులు) అప్పులను సైతం రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తూ, ఇప్పటికే పరిమితికి మించి అప్పు చేశారంటూ కొత్త అప్పులపై ఆంక్షలు విధించింది. సెక్యూరిటీ బాండ్ల తనఖాకు కూడా కేంద్రం, ఆర్బీఐ నిరాకరిస్తున్నాయి. రుణ సమీకరణకు ఎలాగైనా అనుమతి పొందాలని రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా పన్నుల పెంచాలని భావిస్తోంది.

CM Jagan | Min KTR : ఇక్కడ కుస్తీ.. దావోస్‌‌లో దోస్తీ.. పెట్టుబడుల్లో మాత్రం పోటాపోటీ.. ఎవరికి ఎంతంటే..


వీటిపై అదనపు టాక్స్? :   పన్నుల పెంపు ప్రతిపాదనలు సిద్దం చేయాల్సిందిగా కమర్షియల్ టాక్స్, ట్రాన్స్ పోర్ట్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, పంచాయితీ రాజ్ వ్యవస్థలు, మున్సిపాలిటీలు, తదితర విభాగాలకు ఇప్పటికే అంతర్గత ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఫీజులను ఇటీవలే పెంచి ఉండటంతో మరోసారి స్వల్పంగా పెంచాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నది. కొత్త అప్పులకు కేంద్రం నిరాకరించిన దరిమిలా, ప్రభుత్వ బాండ్ల తాకట్టు, రుణ సమీకరణలపై ఆర్బీఐ నుంచి కూడా క్లారిటీ వచ్చిన వెంటనే పన్నుల పెంపుపై కేసీఆర్ సర్కార్ నిర్ణయం వెలువడొచ్చని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారాలపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలైతే వెలువడలేదు. కాగా,

PM Kisan | PM SYM : రైతులకు మరో శుభవార్త.. ప్రతినెలా రూ.3000 పెన్షన్.. పీఎం కిసాన్ ద్వారా ఇలా..


కేబినెట్ భేటీ :  సంక్షేమ పథకాల పేరిట పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం రావడంలేదన్న ఆందోళనలో ఉన్న కేసీఆర్ సర్కారు ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అందుకే హుటాహుటిన హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీలును బట్టి బుధవారం(మే 25న) నాడే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి, కొత్త ఆదాయ వనరులను అన్వేషించడం, మార్కెట్‌ రుణాలు తీసుకోవడం వంటి అంశాలే అజెండాగా క్యాబినెట్‌ సమావేశం జరగొచ్చని తెలుస్తోంది. అయితే, ప్రతి శుక్రవారం రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ నిర్ణయాలు వెలువరిస్తుంది కాబట్టి, అప్పటిదాకా ఆగుదామా? అనే మీమాంస కూడా కొనసాగుతోంది. కేబినెట్ భేటీలోనే..

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ తేదీ ఇదే


అసెంబ్లీ సమావేశం? :  బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొనాళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా నిరాకరణలు ఎదురవుతుండంతో ఈ అంశంపై కేంద్రం తీరును మరింత ఎండగట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికోసం ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని యోచిస్తున్నారు. క్యాబినెట్‌ భేటీలోనే అసెంబ్లీ సమావేశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు రైతులకు వ్యతిరేకంగా కేంద్రం అమలు చేయనున్న విద్యుత్తు సంస్కరణలపైనా మంత్రివర్గం చర్చించే అవకాశాలున్నాయి. ఈ విషయాలపై అత్యవసరంగా చర్చించేందుకే ఢిల్లీ పర్యటన నుంచి సీఎం అర్ధాంతరంగా రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిసింది. మొత్తంగా తెలంగాణ కొత్త అప్పులపై కేంద్రం ఆంక్షల దరిమిలా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Pm modi, Telangana, Trs, Union government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు