Home /News /telangana /

TRS CM KCR LED TELANGANA CABINET MEET TO EXPLORE OPTIONS FOR RAISING ADDITIONAL RESOURCES AMID CENTRE RESTRICTIONS MKS

CM KCR : తెలంగాణ కేబినెట్ సమావేశం.. నిధుల సమీకరణ, పథకాల అమలుపై కేసీఆర్ ఫోకస్..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన గురువారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు ఎజెండాగా క్యాబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులు, స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలపైనా చర్చించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana
తెలంగాణ (Telangana)కు కేంద్రం నిధులు రాకపోగా, బడ్జెట్ అంచనాల మేరకు రాష్ట్రం చేయదలచిన అప్పులకు సైతం మోదీ సర్కారు ఆంక్షలు విధిస్తోందంటూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న దరిమిలా నేటి కేబినెట్ భేటీలో నిధుల అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన గురువారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

ప్రగతి భవన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమవుతుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు ఎజెండాగా క్యాబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇస్తామన్న రూ.10 లక్షల పింఛన్లకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో దశ అమలు, అవసరమైన నిధుల కేటాయింపుపైనా చర్చ జరగనుంది.

Jagananna Vidya Deevena: నేడే ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. బాపట్లలో సీఎం జగన్ విద్యా దీవెన పంపిణీ..


మరోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఒక రోజు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాజెక్టులను ఆదుకోవడానికి నిధులు అందించే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.



అలాగే, నీటిపారుదల శాఖలో అడ్‌హక్‌ సీనియారిటీ రూల్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఇన్‌చార్జీ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇంజనీర్లకు రివర్షన్ల సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి వీలుగా 12 సూపర్‌న్యుమరరీ పోస్టుల సృష్టికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారా, ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తారా అనేది స్పష్టతరాలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: Cabinet Meeting, CM KCR, Telangana

తదుపరి వార్తలు