Home /News /telangana /

TRS CM KCR GOVT TO RELEASE DEVELOPMENT FUNDS TO MUNUGODE ASSEMBLY AMID BY ELECTION AFTER CONGRESS KOMATIREDDY RAJ GOPAL REDDY TO BJP MKS

Munugode Bypoll : మునుగోడుకు భారీగా నిధులు.. అమల్లోకి CM KCR హామీలు.. కోమటిరెడ్డి కోరిందే?

సీఎం కేసీఆర్ తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి (పాత ఫొటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యం కానున్న మునుగోడు ఉప ఎన్నిక వేళ నియోజకవర్గానికి నిధుల ప్రవాహం మొదలైంది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల తాలూకు రూ.కోట్ల విడుదలకు రంగం సిద్ధమైంది. వివరాలివే..

తెలంగాణలో విపక్ష ఎమ్మెల్యేలు.. అధికార టీఆర్ఎస్ లో చేరితేనో, ఉప ఎన్నిక వస్తేనో తప్ప సదరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు రావడంలేదనే ఆరోపణల నడుమ, దానినే ప్రధానాంశంగా పేర్కొంటూ మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy). అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తర్వాత అనివార్యం కానున్న మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll)పై మూడు పార్టీలూ ముందస్తూ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి ఈనెల 7న బీజేపీలో చేరనుండగా, మునుగోడును కైవసం చేసుునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ పరమైన నిర్ణయాలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది..

ఇన్నాళ్లుగా అభివృద్ధి పనులకు, నిధుల విడుదలకు నోచుకోని నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇకపై వేగంగా నిధులు మంజూరు కానున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల స్థాయిలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోగా.. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నిధులు కూడా మునుగోడుకు మంజూరు కాలేదు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజీనామా సమయంలోనే పెండింగ్ నిధులకు మోక్షం లభిస్తుండటం అనూహ్యంగా మారింది.

TRS | BJP : బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు.. 7న అమిత్ షా సమక్షంలో!


నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి (నోముల భగత్)ని గెలిపించేందుకుగాను నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షల అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.168.80 కోట్లు, 31 మండలాలకు రూ.9.30 కోట్లు కేటాయిస్తూ 2021 జూన్‌ లోనే జీవో (నెంబరు 232) విడుదల చేశారు. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని 157 గ్రామ పంచాయతీలు, ఆరు మండల కేంద్రాలకు కలిపి మొత్తం రూ.33.20 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటిదాకా మునుగోడుకు పైసా ఇవ్వలేదని తెలుస్తోంది.

Nancy Pelosi | Taiwan : తైవాన్‌పై China యుద్ధ శంఖం.. చిచ్చురేపిన అమెరికా స్పీకర్ పర్యటన..


మునుగోడు నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్లే ఈ నియోజకవర్గానికి నిధుల విడుదలను అధికార పార్టీ అడ్డుకుందన్న ఆరోపణలున్నాయి. నిధుల సాధన కోసం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కానీ, వారు ఎంతకీ స్పందించకపోవడంతో తరువాత ఆ విషయాన్ని ఆయన వదిలేశారు.

Nethanna Beema : దేశంలోనే తొలిసారి.. రైతు బీమా తరహాలో చేనేత కుటుంబాలకు రూ.5లక్షలు : KTR


తాజాగా రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, మునుగోడుకు ఉపఎన్నిక ఖాయం కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, గతంలో ఇచ్చిన హామీల అమలుపై అధికార టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత ఎన్నికల నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న గట్టుప్పల్‌ మండల ఏర్పాటు హామీని ఇటీవలే నెరవేర్చింది. దీంతోపాటు సీఎం గతంలో ప్రకటించిన రూ.33.20 కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. వీటితోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మునుగోడు బాటపట్టనున్నట్లు అంచనా. ఇంకా..



రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమాలోచన సమయం నుంచే ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ తరహాలోనే మునుగోడులోనూ ఉప ఎన్నిక వేళ అభివృద్ధి నిధుల వరద ఖాయంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి కోరుకున్నదే కేసీఆర్ సర్కారు చేస్తోందనే వాదనా వినిపిస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Congress, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు