హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Droupadi Murmu : కొత్త రాష్ట్రపతిని కలిసే తొలి సీఎం! ఢిల్లీలో కేసీఆర్ వ్యూహాత్మక పర్యటన

KCR | Droupadi Murmu : కొత్త రాష్ట్రపతిని కలిసే తొలి సీఎం! ఢిల్లీలో కేసీఆర్ వ్యూహాత్మక పర్యటన

కేసీఆర్, ముర్ము (ఫైల్ ఫొటోలు)

కేసీఆర్, ముర్ము (ఫైల్ ఫొటోలు)

జాతీయ పార్టీ పెడతానన్న టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సమయంలో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతల స్వీకారం, వచ్చే వారంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు, వాడి-వేడిగా సాగుతోన్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో..

ఇంకా చదవండి ...

దేశానికి ప్రత్యామ్నాయ అజెండా సెట్ చేసేందుకు కొత్త జాతీయ పార్టీ పెడతానన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కీలక సమయంలో హస్తినలో పర్యటిస్తున్నారు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) బాధ్యతల స్వీకారం, వచ్చే వారంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు, వాడి-వేడిగా సాగుతోన్న పార్లమెంట్ సమావేశాలు (Parliament Session), తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సవాళ్లు, బీజేపీ-టీఆర్ఎస్ (BJP TRS) మాటల యుద్ధం, కల్వకుంట్ల కుటుంబంపై ఈడీ, ఐటీ దాడుల బెదిరింపులు.. తదితర పరిణామాల మధ్య సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రత్యక్షమైన కేసీఆర్.. రాబోయే మూడు రోజులపాటు అక్కడే మకాం వేయనున్నారు.. (CM KCR Delhi Visit)

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్, జి.రంజిత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్, తదితరులున్నారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మూడు రోజులపాటు ఉంటారని తెలుస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో..

President Droupadi Murmu : రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంలోనే సంచలనం..


ముర్ముతో మర్యాదపూర్వక భేటీ? : భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును కలిసి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు. ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కార్యాలయ వర్గాలు ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం. గ్రీన్ సిగ్నల్ వస్తే గనుక కొత్త రాష్ట్రపతిని కలిసే తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు. ఎలాగూ తెలంగాణ సీఎం బీజేపీయేతర నేతే కాబట్టి రాజకీయంగా తన తటస్థవైఖరిని ముర్ము చాటుకునే సందర్భంగానూ ఈ భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ప్రెసిడెంట్ తో సీఎం భేటీపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటనైతే రాలేదు.

Fiscal Council : ఎడాపెడా అప్పులు చేసే సీఎంలకు చెక్! -రాష్ట్రాల రుణాల అనుమతికి స్వతంత్ర వ్యవస్థ?


ఉపరాష్ట్రపతి ఎన్నికలు : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో రెండో ప్రధానాంశం ఉపరాష్ట్రపతి ఎన్నికలు. వచ్చేనెల (ఆగస్టు) 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుకుండగా, పోటీలో ఉన్న విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వాకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అంశమై తమ పార్టీ ఎంపీలతో పాటు భావ సారూప్య పార్టీల ఎంపీలతోనూ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Twitter Tillu : ట్విట్టర్ టిల్లూ : అట్లుంటది కేటీఆర్-బండి సంజయ్ తోని! ఈడీ దాడిపై రచ్చరచ్చ


మోదీపై మాటల దాడి కొనసాగింపు : ఈసారి ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ వివిధ జాతీయ అంశాలకు సంబంధించి జాతీయ మీడియాతోను సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కేసీఆర్, వాటిని దేశవ్యాప్తంగా సదస్సులు, సభల ద్వారా వివరించాలని భావిస్తున్నారు. అలాగే..

రైతు ఉద్యమానికి బాసటగా : బీజేపీపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రోడ్‌మ్యాప్‌నూ ఇటీవల రూపొందించారు. రైతు సంఘాల నాయకుడు రాకేష్‌ తికాయత్‌తో పాటు పలువురు రైతు సంఘాల నేతలతోనూ ఈ సభల నిర్వహణపై చర్చించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఈ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Delhi, Draupadi Murmu, Telangana, Trs

ఉత్తమ కథలు