జూపల్లికి టీఆర్ఎస్ ఝలక్...రెబల్స్‌‌కు పార్టీలోకి నో ఎంట్రీ

జూపల్లి మద్దతుతో గెలిచిన రెబెల్స్ ను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఒప్పుకోలేదు. కొల్లా పూర్ లోని 20 స్థానాల్లో 11 స్థానాల్లో జూపల్లి వర్గం సత్తా చాటింది. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లతో కొల్లాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

news18-telugu
Updated: January 26, 2020, 1:28 PM IST
జూపల్లికి టీఆర్ఎస్ ఝలక్...రెబల్స్‌‌కు పార్టీలోకి నో ఎంట్రీ
మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు(ఫైల్ ఫోటో)
  • Share this:
రెబెల్స్‌ను గెలిపించి సొంత పార్టీకే షాక్ తినిపించిన మాజీ మంత్రి జూపల్లికి టీఆర్ఎస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. జూపల్లి మద్దతుతో గెలిచిన రెబెల్స్ ను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఒప్పుకోలేదు. కొల్లా పూర్ లోని 20 స్థానాల్లో 11 స్థానాల్లో జూపల్లి వర్గం సత్తా చాటింది. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లతో కొల్లాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మున్సిపల్​ రిజల్ట్స్​లో టీఆర్ఎస్​కు రెబల్స్​ దెబ్బ గట్టిగానే​ కనిపించింది. కొన్నిచోట్ల అధికారిక పార్టీ​ క్యాండేట్ల కంటే రెబెల్స్​ ఎక్కువ సంఖ్యలో గెలిచారు. దీంతో కొన్ని జిల్లాలో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా కొల్లాపూర్‌‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో జూపల్లి వర్గం పైచేయి సాధించింది.

తన మద్దతుదారులకు టీఆర్ఎస్‌‌ టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి కొల్లాపూర్‌‌ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో రెబల్స్‌ను తరఫున బరిలోకి దింపారు. ఫలితంగా 11 సీట్లతో మున్సిపాలిటీని జూపల్లి వర్గం గెలుచుకుంది. అటు అలంపూర్‌‌ నియోజకవర్గంలోని అయిజలోనూ 20 సీట్లకుగాను రెబెల్స్​ 10 చోట్ల, కాంగ్రెస్‌‌ 6, టీఆర్‌‌ఎస్‌‌ నాలుగు స్థానాల్లో గెలిచాయి.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు