స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలకు గాను ఇప్పటికే 6 స్థానాలను ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్.. 10 వ తేదిన జరిగిన ఎన్నికల్లో సైతం మిగిలిన ఆరు స్థానాలను సైతం గెలుచుకుంది. కాగా మెదక్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్ధార్ రవీందర్ సింగ్ బరిలో నిలిచి ఆ తర్వాత టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా ఆయనకు బహిరంగంగానే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలికారు.
కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుండి పోటిలో నిలిచిన భానుప్రకాశ్ రావుతోపాటు ఎల్. రమణలు విజయం సాధించారు. భానుప్రకాశ్ రావుకు 584 ఓట్లు , రాగా ఎల్ రమణకు 441 ,ఓట్లు పోలు కాగా, రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు పోలయ్యాయి.కాగా ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 984 ఓట్లకు ఒక్కటి తక్కువైనా... తమలో క్రమశిక్షణ లేనట్టేనని సవాల్ కూడా విసిరారు అందుకు అనుగుణంగానే ఆ పార్టీ ఓట్లు సాధించింది.
ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి విట్టల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి.సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 666 ఓట్ల మెజార్టీతో విట్టల్ విజయం సాధించారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి.
ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగరేసింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి.
మరోవైపు మెదక్ జిల్లాల స్థానాల్లో కూడా ఆపార్టీ విజయం సాధించింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.
నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. నల్లగొండలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివని అధికారులు తేల్చారు. దీంతో ఇక్కడ గెలుపు కోటా 593కు చేరింది. ఈ క్రమంలోనే కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mlc elections, Telangana, Trs