హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR National Party: బీజేపీ వ్యతిరేక కూటమి భేటీకి TRS​ చీఫ్​ కేసీఆర్​ డుమ్మా..! అసలేం జరుగుతోంది?

KCR National Party: బీజేపీ వ్యతిరేక కూటమి భేటీకి TRS​ చీఫ్​ కేసీఆర్​ డుమ్మా..! అసలేం జరుగుతోంది?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

అప్పుడప్పుడు కేసీఆర్​ వ్యూహాలు ఎవరికీ అర్థం కాకుండానే ఉంటాయి. తాజాగా బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసే హర్యానాలో జరిగే పర్యటనకు కేసీఆర్​ వెళ్లకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  జాతీయ రాజకీయాల్లోకి (National Politics) వెళ్లడానికి టీఆర్​ఎస్ (TRS)​ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కొన్ని నెలల నుంచి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు కేసీఆర్​. కేంద్రంలోకి బీజేపీ రహిత ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ముక్త భారత్​ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఓవైపు కేసీఆర్ (KCR) ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్‌ వేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కేసీఆర్​ వ్యూహాలు ఎవరికీ అర్థం కాకుండానే ఉంటాయి. తాజాగా బీజేపీ వ్యతిరేక పార్టీలు (anti-BJP parties )కలిసే హర్యానాలో జరిగే పర్యటనకు కేసీఆర్​ వెళ్లకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఆ పర్యటన ఏంటి? జాతీయ రాజకీయాల్లో ఆ పర్యటనకు ఎంత వరకు విలువ? ఒకసారి తెలుసుకుందాం.

  బీజేపీ వ్యతిరేక ఫ్రంట్​ కోసం..

  అయితే . హర్యానా  (Haryana) దివంగత సీఎం దేవీలాల్ జయంతిని 'సమ్మాన్ దివస్' పేరుతో సెప్టెంబరు 25న ఫతేబాద్ లో ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నాలకు ఐఎన్ఎల్డీ శ్రీకారం చుట్టింది.

  ఈ జాతీయ వేదికకు తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్వాదీ,  టీఆర్ఎస్ , జేడీఎస్,తెలుగుదేశం (TDP) తదితర పార్టీలను సైతం ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాష్ చౌతాలా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత  కలిగిన ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాగా, ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల నేతలు రానున్నారు. కానీ కేసీఆర్ మాత్రం హాజరు కాకపోవడం ఇపుడు చర్చనీయాంశం అయింది. టీఆర్ఎస్ (TRS) తరఫున ప్రతినిధులు కూడా హాజరుకావడం లేదు. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన ఇవ్వకున్నా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లేవీ జరగలేదు.

  ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే (శివసేన), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ కనిమొళి, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తదితరులు హాజరవుతున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, బీజేపీకి చెందిన బీరేందర్ సింగ్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం ఇచ్చారని ఐఎన్ఎల్డీ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా తెలిపారు.

  అందుకే వెళ్లడం లేదా?

  అయితే ఇలాంటి సమావేశానికి గులాబీ బాస్​ వెళ్లకపోవడం ఆయా పార్టీలతో పాటు టీఆర్​ఎస్​ అనుచర గణంలో కూడా విస్మయం కలిగిస్తోంది. కేసీఆర్​ వ్యూహం ఏమిటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు గులాబీ దళం. మరోవైపు ఈ సమావేశానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వస్తుండటంతో ఆయనతో వేదికను పంచుకోలేక కేసీఆర్​ దూరంగా ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Haryana, Politics, Trs

  ఉత్తమ కథలు