కరీంనగర్ జిల్లా..న్యూస్18తెలుగు. కారస్పాండెంట్. శ్రీనివాస్. పి
హుజురాబాద్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకు హీటేక్కిస్తున్నాయి..ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు గత రెండు నెలల నుండి అక్కడే మాకం వేసి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా అధికార పార్టీ నేతలు నిత్యం పార్టీ అభ్యర్థులు, క్యాడర్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఈట రాజేందర్‌పై పార్టీ నాయకత్వం ఆధారపడడంతో ఆయన రాజీనామాతో పార్టీ హైకమాండ్‌లో టెన్షన్ పట్టుకుంది. దీంతో పక్క పార్టీల నేతలకు ఇప్పటికే గాలం వేశారు. దీంతో టీడీపీ, బీజేపీలతో పాటు కాంగ్రేస్ పార్టీ నేతలను సైతం తమవైపు మలుచుకున్నారు. ఇలా ఐదారుగురు నేతలు ఇతర పార్టీల నుండి వలస రావడంతో అభ్యర్థులుగా పోటి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈనేపథ్యంలో సీఎం కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఆయన కసరత్తు ప్రారంభించారు. కేంద్రం ఎప్పుడు ఎన్నికలను నిర్వహిస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో తన అభ్యర్థిని ప్రకటించడమే మేలనే అభిప్రాయానికి అధికార పార్టీ వచ్చింది. దీంతో ప్రగతి భవన్‌కు కీలక నేతలను రప్పించి వారి బలాబలాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇలా హుజురాబాద్ లో ఈటలపై పోటీ చేయించేందుకు ఫైనల్ గా ఐదుగురి పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం . వీరిలో ముద్దసాని మాలతి , ముద్దసాని పురుషోత్తం రెడ్డి , పాడి కౌశిక్ రెడ్డి , స్వర్గం రవి , గెల్లు శ్రీనివాస్ యాదవ్ ల పైనే ఆరా తీస్తున్నట్టు సమాచారం . రెండు రోజుల క్రితం ప్రగతిభవన్ లో జరిగిన చర్చలో కూడా ఈ ఐదుగురి గురించే ప్రస్తావించినట్టు సమాచారం . వీరిలో ఎవరైతే బావుంటుంది అన్న విషయంపై సమగ్రంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది .
వారంలోగా అభ్యర్థి ప్రకటించే అవకాశం..
సీఎం కేసీఆర్ సమావేశంతో.. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని వారం రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి . ఈలోగా ఐదుగురిలో బలమైన అభ్యర్థిని గుర్తించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి..ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తమ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తే ప్రజల్లోకి వెల్లడంతో పాటు ఈటలను ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయనే యోచనతో గులాబి పార్టీ వ్యుహాలు రచిస్తోంది.
కాగా నియోజకవర్గంలో మకాం వేసిన ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. మరోవైపు తన బలాన్ని పెంచుకునేందుకు పాదయాత్ర సైతం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. దీంతో అధికార పార్టీ సైతం ప్రతివ్యూహాలను రిచించి ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Eetala rajender, Huzurabad By-election 2021, Telangana bjp, Trs