హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad : నాగార్జున సాగర్ రీపిట్ అవుద్ది... ఎంత సీనియర్ అయినా...మాదే గెలుపు..

Huzurabad : నాగార్జున సాగర్ రీపిట్ అవుద్ది... ఎంత సీనియర్ అయినా...మాదే గెలుపు..

తలసాని శ్రీనివాస్ యాదవ్

తలసాని శ్రీనివాస్ యాదవ్

Huzurabad : హుజూరాబాద్‌ బీసిని ఎమ్మెల్యే అభర్థిగా సీఎం కేసిఆర్ ప్రకటించడంతపై ఆ పార్టీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాదవ కులానికి చెందిన వారు ఐదుగురు ఉన్నారని ఇప్పుడు మరొకరు చట్టసభలకు ఎంపిక కానున్నారని మంత్రి శ్రీనివాసయాదవ్ అన్నారు.. బీసీలకు సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

ఇంకా చదవండి ...

గెల్లు ఎంపికపై యాదవ నేతల హర్షం

హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించడంతో ఆ పార్టీకి చెందిన బీసి నేతలు హర్షం వ్యక్తం చేశారు..ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస యాదవ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. గెల్లు శ్రీనివాస యాదవ్‌కు ఉద్యమంలో పాల్గొనడంతోపాటు ఆయన కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీనివాస్‌ను ఎందుకు ఎంపిక చేశారో కూడా వివరించారు. బడుగుల బలహీన వర్గాలు చట్టసభల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టారని అన్నారు.. ఇందులో భాగంగానే యాదవ కులానికి చెందిన వారికి సంబంధించిన వారు ఇప్పటికే అయిదుగురు చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు.ఈ క్రమంలో సామాజిక న్యాయం కల్గించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్, గెల్లు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారని అన్నారు. అన్ని వర్గాలు ఆయన్ను ఆశీర్వాదించి గెలిపించాలని కోరారు.

బీజేపి గెలిస్తే సంఖ్య పెరగడం.తప్ప... ప్రయోజనం లేదు

మరోవైపు నియోజకర్గంలో బీజేపీ గెలవడ ద్వార సీట్ల సంఖ్య పెరుగుతుంది తప్ప, ఇతర ప్రయోజనాలేవి ఉండవని అన్నారు. ఈటల గెలిచినా..అభివృద్ది విషయంలో చేతులెత్తాస్తారని అన్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే..ఆయనకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉంటాయని దీంతోపాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు..అంతే తప్ప ఈటల గెలవడం ద్వార ఎలాంటీ అభివృద్ది జరగదని అన్నారు.

నాగార్జునసాగర్ రీపీట్ అవుతుంది..

ఇక నాగార్జులసాగర్‌లో కూడా జానారెడ్డి లాంటీ సీనియర్ నేత మీద భగత్‌ను గెలవడం ద్వారా ప్రజల ఆలోచన శైలి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. అందుకే ఈటల రాజేందర్ ఎంత సీనియర్ అయినా టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యతగా ఓటింగ్ జరుగుతుందని అన్నారు. తాజాగా టీఆర్ఎస్‌కు నియోజకర్గంలో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను సీఎం కేసిఆర్ చేపడుతున్నారు కాబట్టే ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. అందుకే మరోసారి టీఆర్ఎస్‌ను గెలిపించనున్నారని చెప్పారు.

First published:

Tags: Gellu Srinivas Yadav, Minister talasani srinivas, Trs

ఉత్తమ కథలు