TRS CADER AND WELLWISHERS FEEL HAPPY OF RELEASE OF PUTTA MADHU VRY KNR
Putta Madhu : పుట్ట మధు ఇంటివద్ద అభిమానుల తాకిడి. పది రోజుల తర్వాత వీడిన మిస్టరీ
పుట్ట మధు ఇంటి వద్ద అభిమానుల తాకిడి. పది రోజుల తర్వాత వీడిన మిస్టరీ
Putta Madhu : పోలీసులు విచారణ తర్వాత తర్వాత పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకోవడంతో అభిమానుల తాకిడి పెరిగింది. పుట్ట మధు నాయకత్వం వర్థిల్లాలి అంటూ ఇంటి వద్ద నినాదాలు చేశారు. కాగా పోలీసుల అరెస్ట్, విచారణ అనంతరం పార్టీ కార్యకర్తలు ,అభిమానుల్లో అందోళన నెలకొన్న విషయం తెలిసిందే..
పెద్దపల్లి జిల్లా. న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి
చాల రోజుల తర్వాత పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకోవడంతో అభిమానుల తాకిడి పెరిగింది. పుట్ట మధు నాయకత్వం వర్థిల్లాలి అంటూ ఇంటి వద్ద నినాదాలు చేశారు. కాగా పోలీసుల అరెస్ట్, విచారణ అనంతరం పార్టీ కార్యకర్తలు ,అభిమానుల్లో అందోళన నెలకొన్న విషయం తెలిసిందే..
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, అధికార పార్టీ నేత పుట్టమధుపై.. గత వారం రోజుల నుండి వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఆయన నిత్యం వార్తల్లో నిలిచాడు. కాగా నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయడంతో వామన్‌రావు దంపతుల కేసు విచారణలో భాగంగా రామగుండం పోలీసులుఅదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు ప్రశ్నించారు.
మరోవైపు ఈటలకు అంత్యంత సన్నిహితుడిగా ఉన్న మధుపై కూడ భారీ కుట్ర జరుగుతుందని రాజకీయ
వర్గాలు, ఆయన అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతారని ప్రచారం కూడ జరిగింది. ఈ నేపథ్యంలోనే గత వారం పది రోజులు గా మంథని నియోజకవర్గంలో నెలకొన్న ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది .పోలీసులు మంగళవారం రాత్రీ మూడు రోజుల విచారణ అనంతరం ఆయన్ను వదిలి వేశారు. పుట్టా మధు ఇంటికి చేరుకున్నారు.
మంగళవారం ఉదయం విషయం కాస్త తెలియడంతో పెద్ద ఎత్తున్న నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ,
కార్యకర్తలు , అభిమానులు తరలివచ్చి ఆనందం వ్యక్తం చేశారు . తీవ్ర ఉత్కంఠ నడుమ ఆయన ఇంటికి
చేరుకోవడంతో మంథని లో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే విషయమై పోలీసులు మళ్లి పిలవడంతో కార్యకర్తల్లో ఓ వైపు ఆనందం మరోవైపు ఆందోళన కూడ నెలకోంది. వామన్ రావు కేసుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో పాటు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కోర్టుకు రావడంతో హత్య కేసు ఉదంతంలో ఎం జరుగుతుందనే యోచనలో స్థానికులతో పాటు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయితే కోర్టులో విచారణ అనంతరం అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.