హోమ్ /వార్తలు /తెలంగాణ /

సాగర్ వార్‌ రెడీ.. టీఆర్ఎస్, బీజేపీ దాగుడుమూతలు.. ఆ ఫలితాలే కీలకం..

సాగర్ వార్‌ రెడీ.. టీఆర్ఎస్, బీజేపీ దాగుడుమూతలు.. ఆ ఫలితాలే కీలకం..

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

మరో పది రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఈ విషయంలో ముందుగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందా ? లేక బీజేపీ నిర్ణయం ప్రకటిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో మరో కీలకమైన ఉప ఎన్నికకు తెరలేచింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి మాజీమంత్రి జానారెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన కుటుంబసభ్యులకు పోటీ చేసే అవకాశాన్ని గులాబీ బాస్ ఇస్తారా ? లేదా ? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారని.. వాటి ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తారని వార్తలు వినిపించాయి.

ఇక టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాతే సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని బరిలోకి దింపడమా లేక యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని పోటీ చేయించడమా ? అనే అంశంపై బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో పది రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఈ విషయంలో ముందుగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందా ? లేక బీజేపీ నిర్ణయం ప్రకటిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అంశం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఫలితాలను బట్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు.. అందులోనూ బీజేపీ, టీఆర్ఎస్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి నాగార్జునసాగర్ సంగ్రామానికి నగారా మోగడంతో.. టీఆర్ఎస్, బీజేపీ ఏ విధంగా ముందడుగు వేస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

First published:

Tags: Nagarjuna Sagar By-election, Telangana

ఉత్తమ కథలు