Home /News /telangana /

TRS BJP INTERESTING FLEX FIGHT AHEAD OF BJP NATIONAL EXECUTIVE MEETING 2022 IN HYDERABAD PCV

TRS Vs BJP : సాలు మోదీ.. సంపకు! మంటలు రేపుతున్న ఫ్లెక్సీ వార్‌..! బీజేపీ ఏం చేస్తుందిప్పుడు?

TRS Vs BJP : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనకు ముందే.. తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. వచ్చే నెల జులై నుంచి హైదరాబాద్ లో మొదలుకానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ, షా, నడ్డా రానున్నారు. ప్రధాని రాకకు ఐదు రోజుల ముందే.. టీఆర్ఎస్ పొలిటికల్ ఫ్లెక్సీ వార్ మొదలుపెట్టేసింది.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్న సీఎం కేసీఆర్.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుండటంతో.. బీఆర్ఎస్ స్థాపన ప్రకటనకు బ్రేక్ ఇచ్చారు. ఐతే.. సందు దొరికినప్పుడల్లా.. టీఆర్ఎస్ సర్కారు ఈ 8 ఏళ్లలో ఏం చేసింది.. ఎటువంటి మార్పు తెచ్చింది అనేది దేశానికి చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.



రీసెంట్ గా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు దేశమంతటా దాదాపు అన్ని భాషల్లోనూ పేపర్ ప్రకటనలు, హోర్డింగులతో ప్రచారం చేయించింది టీఆర్ఎస్. కేసీఆర్ అమలు చేసిన స్కీములు, జరిగిన ప్రగతి, సంక్షేమాన్ని అందులో వివరించారు.

బీజేపీకి, ప్రధాని మోదీకి.. కాంగ్రెస్ లేదా మమతా బెనర్జీ ప్రత్యామ్నాయం కాబోరని.. తానే ప్రత్యామ్నాయం అని చెప్పేందుకు కేసీఆర్ ప్రతి సందర్భాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రధాని రాకకు ముందే.. టీఆర్ఎస్ హవాను చూపించేలా ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని అన్ని ప్రధాన జంక్షన్లలోని హోర్డింగ్ బోర్డులు, మెట్రో పిల్లర్లను కేసీఆర్, టీఆర్ఎస్ పాలన ఫ్లెక్సీలతో నింపేశారు.

మోదీ, బీజేపీ ఫ్లెక్సీలు పెట్టాలని అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీ నేతలు దీంతో.. షాక్ తగిలినట్టయింది. జాతీయ కార్యవర్గసమావేశాలకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టేందుకు ఆల్టర్ నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు బీజేపీ నేతలు.

సాలు మోదీ..సంపకు మోదీ..!

సాలు దొరా.. ఇక సెలవు దొరా! అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా జూన్ 24 నుంచి తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వింగ్.. స్పెషల్ క్యాంపెయిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్ ఇస్తూ.. ఓ భారీ ఫ్లెక్సీ సికింద్రాబాద్ టివోలీ చౌరస్తాలో కనిపించింది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటుచేశారనేది క్లారిటీ లేనప్పటికీ.. సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ దానిపై రాసి ఉంది. రైతు చట్టాలతో రైతులను, పన్నులతో సామాన్యులను, వ్యాపారులను, అగ్నిపథ్ తో యువతను మోదీ పెట్టారని.. ఇక చాలని బైబై మోదీ ByeBye Modi అని స్లోగన్స్ దానిపై ఉన్నాయి.

Saalu Dora digital Flex by BJP in Hyderabad


తెలంగాణలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ప్రధాని రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.. ఈ ఫ్లెక్సీపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోదీపై దురుద్దేశపూర్వకంగా ఫ్లెక్సీ పెట్టారని, అవాస్తవ ఆరోపణలు చేశారని ఫైరవుతున్నారు. ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. సిటీని జులై 2నాడు కాషాయమయం చేసేందుకు ఆల్టర్ నేట్ ఆప్షన్స్ ను వెతుకుతున్నారు.
Published by:V. Parameshawara Chary
First published:

Tags: CM KCR, PM Narendra Modi, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు