హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: దుబ్బాకపై ఎవరి లెక్క వారిదే.. టీఆర్ఎస్ ఇలా.. బీజేపీ అలా..

Dubbaka: దుబ్బాకపై ఎవరి లెక్క వారిదే.. టీఆర్ఎస్ ఇలా.. బీజేపీ అలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka by elections: మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఎవరికి ఆనందాన్ని ఇవ్వనున్నాయి... ఎవరికి షాక్ ఇవ్వనున్నాయనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

  దుబ్బాకలో ఉప ఎన్నిక ముగిసి మూడు రోజులైంది. మరో నాలుగు రోజుల్లో ఫలితం కూడా రానుంది. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేసిన పార్టీలు.. ఏయే మండలాల్లో తమకు ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల్లో దివంగత టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి 73 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. ఈసారి మెజార్టీ కాస్త తగ్గొచ్చని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి కారణంగా దుబ్బాకలో 50 వేల మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

  దుబ్బాకలోని నాలుగు మండలాల్లో మెజార్టీ ఓట్లు తమకే వస్తాయని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో గట్టి పోటీ మధ్య సాగిన ఈ ఎన్నికల్లో తమకు విజయావకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో పోలిస్తే తమకు మెరుగైన స్థాయిలో ఓటింగ్ శాతం ఉంటుందని భావిస్తోందని తెలుస్తోంది. చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం తమకు కలిసొచ్చిందని అంచనా వేసుకుంటున్నారు.

  ఈ మూడు పార్టీలు కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్, మాజీ యాంకర్ కత్తి కార్తీక సింహం గుర్తుతో దుబ్బాక నియోజక వర్గంలో బరిలో నిలిచారు. కత్తి కార్తీక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సింహం గుర్తుకు ఓటు వేశారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ సింహం గుర్తు అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓట్లను ఎంతమేరకు చీల్చిందనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఎవరికి ఆనందాన్ని ఇవ్వనున్నాయి... ఎవరికి షాక్ ఇవ్వనున్నాయనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు