తృటిలో బయటపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... కారు నుజ్జు నుజ్జు

ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు.

news18-telugu
Updated: March 18, 2020, 2:50 PM IST
తృటిలో బయటపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... కారు నుజ్జు నుజ్జు
ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన జీవన్ రెడ్డి కారు ముందు భాగం
  • Share this:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఆయన కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నామినేషన్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ ఎంపీ కవిత వెనుక భారీ కాన్వాయ్ వస్తోంది. అందులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు కూడా ఉంది. అయితే, కాన్వాయ్ వెళ్తున్న సమయంలో తూప్రాన్ వద్ద జీవన్ రెడ్డి కారును మరో వాహనం ఢీకొట్టింది. దీంతో జీవన్ రెడ్డి కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రేంజ్ రోవర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే, కారు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరోవైపు నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కవితకు పార్టీ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చినా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకొనేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 18, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading