Home /News /telangana /

TRS AND KCR GIVES SHOCK TO BJP MLA ETELA RAJENDAR IN LOCAL BODY MLC ELECTIONS AK

Etela Rajendar: ఈటల రాజేందర్‌కు ఈసారి షాక్ తగిలిందా ?.. వ్యూహం బెడిసికొట్టిందా ?

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

TRS: టీఆర్ఎస్‌కు మొత్తం 986 సభ్యుల బలం ఉండగా.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు కలిపి 1063 ఓట్లు వచ్చాయి. విపక్షాలకు 324 సభ్యుల బలం ఉండగా... వారికి కేవలం 234 ఓట్లు మాత్రమే వచ్చాయి.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం తరువాత మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఈ ఉప ఎన్నికల తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో ఈటల రాజేందర్ మాత్రం వ్యూహం మార్చారు. అదిలాబాద్, కరీంనగర్‌లో అభ్యర్థులను బరిలో ఉంచారు. ఇక కరీంనగర్ బరిలో టీఆర్ఎస్ నేత, ఉద్యమంలో పని చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ను టీఆర్ఎస్ రెబల్‌గా పోటీలో నిలిపారు. రవీందర్ సింగ్ పోటీ నుంచి వెనక్కి తగ్గకపోవడం.. ఆయన వెనుక ఈటల రాజేందర్ ఉన్నారని తేలిపోవడంతో టీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన ఈటల రాజేందర్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ షాక్ ఇస్తారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

    దీనికితోడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను మరోసారి ఓడించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో అధికార పార్టీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీకి చెందిన ఓట్లు కచ్చితంగా తమకే పడాలని పట్టుదలగా వ్యవహరించింది. ఈ విషయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ గట్టిగా పని చేశారు. టీఆర్ఎస్ సభ్యులను క్యాంపులకు తరలించారు. అయినా టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ భయం నెలకొంది. అయితే ఫలితాలు మాత్రం టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చింది.

    టీఆర్ఎస్‌కు మొత్తం 986 సభ్యుల బలం ఉండగా.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు కలిపి 1063 ఓట్లు వచ్చాయి. విపక్షాలకు 324 సభ్యుల బలం ఉండగా... వారికి కేవలం 234 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాల నుంచి కూడా టీఆర్ఎస్‌కు క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే రవీందర్ సింగ్‌ను గెలిపించుకోవాలని భావించిన ఈటల రాజేందర్ వ్యూహం ఇక్కడ ఏ మాత్రం పనిచేయలేదు. ఆయన గెలుపు సంగతి అటుంచితే.. కనీసం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అతి విశ్వాసంతో వ్యవహరించారా ? అనే చర్చ జరుగుతోంది.

    Telangana: BJPపై వాట్ నెక్ట్స్.. ఆ రోజు TRS సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న KCR

    Telangana: కేసీఆర్ టార్గెట్ అదేనా ?.. త్వరలోనే భారీ మార్పులు ఉండబోతున్నాయా?

    రవీందర్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగకపోయినా.. ఆయన ఈటల రాజేందర్ మద్దతుతోనే బరిలో ఉండటంతో.. ఆయన బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థి అని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో ఈసారి ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ దెబ్బ కొట్టిందని.. ఆయనకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అధికార పార్టీ జాగ్రత్త పడిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌కు మరోసారి షాక్ ఇవ్వాలని భావించిన ఈటల రాజేందర్... వారిని టెన్షన్ పెట్టడంతో విజయం సాధించినా.. ఫలితాల విషయంలో ఆ పార్టీని ఏం చేయలేకపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు