Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: May 11, 2019, 6:20 AM IST
ఉత్తమ్ కుమార్, కేసీఆర్ (File)
నాలుగు రోజులపాటూ కేరళ, తమిళనాడులో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు. కేరళ పర్యటన తర్వాత తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తో కలిసి మూడో కూటమిపై చర్చించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఆలయాల్ని దర్శించిన ఆయన... తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందువల్ల కేసీఆర్ ఆ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇవాళ కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 14న ఎన్నికలకు నామినేషన్ దాఖలు చెయ్యాల్సి ఉంది. అందుకు సమయం తక్కువగా ఉంది కాబట్టి... ఇవాళ్టి భేటీలో అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు.
రంగారెడ్డి జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంపిక చేసినా, ఆయన ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందువల్ల ఈ స్థానానికి కె.శశిధర్ రెడ్డి, వేనపల్లి చందర్ రావు, తేర చిన్నపురెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
ఇక కాంగ్రెస్ సైతం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయి చర్చించబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రామచంద్ర కుంతియాతోపాటూ పార్టీ సీనియర్ నేతలు హాజరుకాబోతున్నారు. ఈసారి పాత ఓటర్లకే ఓటు హక్కు అవకాశాన్ని ఈసీ కల్పించింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. అటు నుంచీ స్పందన రాకపోవడంతో... ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా లేక... పోటీకి దిగేటట్లైతే, ఎవరిని అభ్యర్థులుగా ఎంచుకోవాలనేదానిపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు.
ఇవి కూడా చదవండి :
ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనా ఔట్... కొత్త సంస్థకు సప్లిమెంటరీ ఫలితాల బాధ్యత
మాజీ ప్రియుడి బ్లాక్మెయిల్... ఓ యువతి ఆవేదన...
అది తోడేలు కాదు కుక్క... జూ అధికారులపై పర్యాటకుల ఫైర్... అసలు విషయమేంటంటే...వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం
Published by:
Krishna Kumar N
First published:
May 11, 2019, 6:20 AM IST