మహేష్, అల్లు అర్జున్‌లను బీభత్సంగా వాడుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీ...

ఈ హెడ్ లైన్ చూడగానే అల్లు అర్జున్‌, మహేష్ బాబుకి, ఈ రాజకీయ పార్టీలకి ఏం సంబంధం ఉందనుకుంటున్నారా?

news18-telugu
Updated: January 18, 2020, 3:24 PM IST
మహేష్, అల్లు అర్జున్‌లను బీభత్సంగా వాడుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీ...
మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)
  • Share this:
ఈ హెడ్ లైన్ చూడగానే అల్లు అర్జున్‌, మహేష్ బాబుకి, ఈ రాజకీయ పార్టీలకి ఏం సంబంధం ఉందనుకుంటున్నారా? ఏమైనా సంబంధం ఉంటే అల్లు అర్జున్‌కి జనసేనతో ఉండాలి కానీ, ఇలా టీఆర్ఎస్, బీజేపీలతో ఏం సంబంధం అని అనుకుంటున్నారా?. ఈ స్టోరీ చదివితే ఆ హెడ్ లైన్ ఎందుకు పెట్టారో అర్ధం అవుతుంది. తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల అభ్యర్థులు రకరకాల వ్యూహాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో కొందరు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునేందుకు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలను వాడుకుంటున్నాయి.

ఈ రెండు సినిమాల్లో వచ్చిన రాములో రాములా, డాంగ్ డాంగ్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి, అందులో పార్టీ అభ్యర్థుల పేర్లను చొప్పించి.. కొత్తగా ప్రజల్లోకి వదులుతున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న అన్ని ఆటోల్లోనూ ఇలాంటి రీమిక్స్, పేరడీ పొలిటికల్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. అందులో ప్రధానంగా రాములో రాములా సాంగ్‌ బీట్‌ను వాడుకుంటున్నాయి పార్టీలు. అదే ట్యూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీలకు వేర్వేరుగా పాటలు రాయించుకుని వాటిని పాడుతూ ఆ సీడీలను ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతున్న ఆ పాటల ట్యూన్లు తమను ప్రజలకు మరింత దగ్గర చేస్తాయని అంచనా వేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 18, 2020, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading