TRS ACTIVIST ATTACK AT TPCC PRESIDENT REVANTH REDDY HOUSE AT HYDERABAD VRY
Revanth reddy vs ktr : రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల మధ్య కర్రలతో దాడులు.!
Revanth reddy vs ktr
Revanth reddy vs ktr : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మద్దతు దారులకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్(trs) కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మద్దతుదారులతో పాటు పోలీసులు(police) అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా ఇరు వర్గాలు కర్రలు , రాళ్లు విసురుకున్నారు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఇంటివద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో రేవంత్ రెడ్డి మద్దతు దారులు సైతం కర్రలతో దాడులు(Attack) చేశారు. దీంతో రోడ్డు మీద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కాగా ఇటివల టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ల(ktr) మధ్య డ్రగ్స్(drugs) విషయంలో వార్ కొనసాగుతోంది. నగరంలో డ్రగ్స్ విచ్చవిడిగా అమ్మడంతో పాటు మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ మాఫితో సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తీవ్రఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలనే ఇద్దరి మధ్య ట్వీట్టర్ (twitter)వేదికగా మాటల యుద్దం కొనసాగింది. రాజీనామాలతో సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. గన్‌పార్క్(gunpark) వద్ద తాను పరీక్షలకు సిద్దంగా ఉంటానని సవాల్ విసిరారు. చెప్పినట్టుగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ తాను ఏ పరీక్షలైనా సిద్దమేనని స్పష్టం చేశారు. అయితే తనతోపాటు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కూడా శాంపిల్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లివచ్చిన వారితో తాను సిద్దంగా లేనని చెప్పడంతో పాటు ఆయన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు సైతం వెళ్లారు.
తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పరువు నష్టం దావా వేశారు. తో పరువు ప్రతిష్టతలు దిగజార్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ సిటి సివిల్ కోర్టులో మంత్రి కేటిఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బేషరుతుగా క్షమాపణ చేప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే తనను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఇరువురు నేతల మధ్య ఉద్రిక్త వాతవరణం నెలకొంది. సినిమా ఇండస్ట్రీకి పరిమితమై డ్రగ్స్ వ్యవహారం రేవంత్ ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయ నాయకుల వైపు మళ్లింది. ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను సైతం రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే తమ నేత కేటీఆర్‌పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు రేవంత్ ఇంటిని ముట్టడించి , దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో మరోసారి ఉద్రిక్తలు చెలరేగాయి.
మొత్తం మీద ఇరు పార్టీల మధ్య డ్రగ్స్ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు, రాహుల్ గాంధీని(Rahul gandi) కూడా లాగడంతో జాతీయ స్థాయిలో సైతం చర్చ కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే సిని ప్రముఖులపై డ్రగ్స్ కేసు విచారణతో వాళ్లకు క్లీన్ ఇచ్చినా.. అది రాజకీయ పార్టీలకు చుట్టుకోవడంతో ఏ వైపు వెళుతుందో అనే కోణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చల విడిగా విక్రయించడం వాటిని ఉన్నత వర్గాల వారితో పాటు వారి పిల్లలు సైతం ఉపయోగించడం నుండి సిని పెద్దల వరకు వెళ్లింది. చివరకు ఆ వివాదం చివరకు రాజకీయాల వైపే తిరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.