కేసీఆర్ గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే...

త్రివిక్రమ్ శ్రీనివాస్ సీఎం కేసీఆర్‌పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అరుదైన సందర్భం ఇటీవల చోటు చేసుకుంది.

news18-telugu
Updated: January 2, 2020, 12:17 PM IST
కేసీఆర్ గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే...
త్రివిక్రమ్, కేసీఆర్
  • Share this:
తనదైన మాటలతో తెలుగు సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ సీఎం కేసీఆర్‌పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అరుదైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ అవార్డ్ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్... కేసీఆర్ సృష్టించింది చరిత్ర కాదని... ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా ఓ భౌగోళిక ప్రాంతాన్ని సృష్టించారని వ్యాఖ్యానించారు. కష్టాన్ని అధిగమించేందుకు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాన్ని ధైర్యం అంటారని... కష్టాలు ఉంటాయని తెలిసి ముందుకు సాగేవారిని సాహసవంతులు అంటారని త్రివిక్రమ్ తెలిపారు. సీఎం కేసీఆర్ అలాంటి సాహసవంతులు అని త్రివిక్రమ్ కొనియాడారు. కేసీఆర్ లాంటి సాహసవంతుల ముందు మరికొందరు సాహసవంతులను సన్మానించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.


First published: January 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు