• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TRIBES IN TELANGANA MAHABUBABAD BEGGING MONEY USING PHONEPE PAYTM GOOGLE PAY SK

Telangana: డిజిటల్ భిక్షాటన.. చిల్లర లేదా.. ఐతే ఫోన్‌పే, గూగుల్ పే చేయండి బాబయ్యా...

Telangana: డిజిటల్ భిక్షాటన.. చిల్లర లేదా.. ఐతే ఫోన్‌పే, గూగుల్ పే చేయండి బాబయ్యా...

ఫోన్ పే క్యూ ఆర్ కోడ్ చూపిస్తున్న యాచకులు (Image: Youtube grab)

గిరిజన ప్రాంతాలకు చెందిన కొంద‌రు యాచ‌కులు క్యాష్‌లెస్ మోడ్‌లో అడుక్కుంటున్నారు. జేబులో డబ్బులు లేకపోతే డిజిటల్ విధానంలో పంపించమని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Share this:
    ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే చాలా మంది యాచకులు మనకు కనిపిస్తారు. దేవాలయాలు, కూడళ్లు వద్ద భిక్షాటన చేస్తూ జీవిస్తారు. యాచకులు ఎవరైనా డబ్బులు అడిగితే.. చిల్లర లేదని చాలా మంది సమాధానం చెబుతారు. ఐతే ఈ చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు యాచకులు. ఏకంగా డిజిటల్ భిక్షాటన చేస్తున్నారు. అవును.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చాలా మంది యాచకులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం చేయమని డబ్బులు అడుగుతున్నారు. క్యూఆర్ కోడ్ బోర్డును చేతిలో పట్టుకొని భిక్షాటన చేస్తున్నారు. చిల్లర లేదని చెప్పుద్దు సార్.. మీకు తోచినంత స్కాన్ చేసి పంపించండి అని కోరుతున్నారు.

    మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ మండ‌లం పెరుమాండ్ల‌, సంకీస గ్రామంలో ఈ దృశ్యాలు కనిపించాయి. గిరిజన ప్రాంతాలకు చెందిన కొంద‌రు యాచ‌కులు క్యాష్‌లెస్ మోడ్‌లో అడుక్కుంటున్నారు. జేబులో డబ్బులు లేకపోతే డిజిటల్ విధానంలో పంపించమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే.. అన్నీ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. స్కాన్ చేసి.. క్లిక్ చేశారంటే.. నేరుగా మా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయనని అంటున్నారు. వీరి చేతిలో క్యూర్ కోడ్స్ చూసి చాలా మంది స్థానికులు తమకు తోచినంత డబ్బులు పంపించి పెద్ద మనసు చాటుకున్నారు.

    కాగా, ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఒకప్పుడు బయటకు వెళ్లాలంటే జేబులో డబ్బులు లేనిదే వెళ్లదేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా చేరుకోవచ్చు. రోడ్డుపక్కన చెప్పుల కుట్టే వ్యక్తుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ డిజిటల్ పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. అందుకే చాలా మంది పర్సులను పక్కనపెట్టేశారు. ఏం కావాలన్నా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం చేసి.. తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లో మాత్రమే కాదు.. చిన్న చిన్న పల్లెటూర్లలోనూ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఎంతో బాగుందని.. చిల్లర కష్టాలు లేవని, పైగా నేరుగా బ్యాంకు ఖాతాలోకే డబ్బులు వెళ్తున్నాయని చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాచకులు కూడా డిజిటల్ భిక్షాటన చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: