హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mallareddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Mallareddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (File)

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (File)

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద భూ ఆక్రమణ కేసు నమోదైంది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుమారుడి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద భూ ఆక్రమణ కేసు నమోదైంది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుమారుడి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో 446, 506 R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సూరారం లో సర్వే నెంబర్ 115,116,117 లో 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి, కొడుకు భద్రా రెడ్డి మరో ఐదుగురు కబ్జా చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రికి అనుకొని ఉన్న భూమి విక్రయించాలంటూ బెదిరిస్తున్నరని, బాధితురాలు శ్యామల దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసిన లాయర్‌ను కొనేసి తెల్లకాగితంపై సంతకాలు తీసుకొని నకిలీ డాకుమెంట్స్ సృష్టించారంటూ శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి అనుకుని ఉన్న 20 గుంటల భూమిని కబ్జా చేసి మంత్రి మల్లారెడ్డి ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపించారు.

Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు


భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అయితే, అప్పట్లో ఇది తప్పుడు ఫిర్యాదుగా తేలడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో శ్యామలకు చెందిన భూమి ఉంది. అయితే, ఆ భూమి పట్టాదారు శ్యామల తల్లి. తన రెండు ఆస్పత్రుల మధ్య భూమి కావడంతో తనకు ఆ ల్యాండ్ విక్రయించాలంటూ తనను మల్లారెడ్డి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అయితే, తాను తమ భూమిని విక్రయించేందుకు నిరాకరించానన్నారు. ఈ క్రమంలో మంత్రికి చెందిన వారు 20 గుంటల భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ కూడా కట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పథకంలో డబ్బులు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం

ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి


ఎద్దుల బండిపై ఎక్కి మంత్రి మల్లారెడ్డి నిరసన

ఓ వైపు తన మీద కేసు నమోదైన రోజే మంత్రి మల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో పాల్గొన్నారు. మేడ్చల్ జాతీయ రహదారిపై ఎద్దుల బండిపైకి ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం మంత్రి ర్యాలీగా బయలు దేరి..చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు పూర్తి మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని తెలిపారు. రైతులకు నష్టం కలిగించే బిల్లు కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతుందని‌, మోదీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలుతుందని వ్యాఖ్యానించారు.

Hacking Apps: ఈ యాప్స్ వాడితే మీ డేటా గోవిందా అంటున్న నిపుణులు

Live Video: చిరుత దాడి.. భయంకరంగా చంపేసింది.. పీక్కుని, లాక్కెళ్లింది

చిన్న వ్యాపారిగా మొదలు పెట్టి ప్రస్తుతం ఎన్నో విద్యాసంస్థల అధినేతగా మారిన మల్లారెడ్డి ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తన పదునైన మాటలతో వివాదాలు కూడా కొనితెచ్చుకుంటూ ఉంటారు. మల్లారెడ్డి కాలేజీలో చదువుకునే విద్యార్థులకు కెరీర్ ముఖ్యమని ప్రేమా దోమా అంటూ జీవితాలు పాడు చేసుకోవద్దని ‘హిత బోధ’ కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తారు.

First published:

Tags: Malla Reddy, Telangana

ఉత్తమ కథలు