స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీల పయనం.. ఇంతలో షాకిచ్చిన ట్రావెల్స్..

బస్సులో తమ ప్రాంతానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని ముందుగానే కొంత నగదు అడ్వాన్సుగా చెల్లించారు. గురువారం సాయంత్రం బస్సు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంది.

news18-telugu
Updated: May 15, 2020, 2:08 PM IST
స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీల పయనం.. ఇంతలో షాకిచ్చిన ట్రావెల్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు ఇక్కడే ఇరుక్కుపోయారు. గత 50 రోజులకి పైగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఎటూ కదలలేకపోయారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. దీంతో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు బాటపట్టారు. అయితే ఒరిస్సా చెందిన కొంతమంది వలస కూలీలు తమ ప్రాంతానికి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అందులో భాగంగానే ఓ బస్సులో తమ ప్రాంతానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని ముందుగానే కొంత నగదు అడ్వాన్సుగా చెల్లించారు. గురువారం సాయంత్రం బస్సు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంది. వలస కూలీలంతా సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. అయితే బస్సు తీసుకొస్తామని చెప్పి వెళ్లిన ట్రావెల్స్ సంస్థ ఇప్పటివరకు రాలేదు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో నడిరోడ్డుపైనే బస్సు కోసం వలస కూలీలు ఎదురుచూస్తున్నారు. ఎంతకీ బస్సు రాకపోవడంతో ఏం చేయలో పాలుపోక సికింద్రాబాద్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద పడిగాపులు కాస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
First published: May 15, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading