TRANSPORT MINISTER PUWADA AJAY KUMAR HAS LODGED A COMPLAINT WITH THE POLICE AGAINST Q NEWS CHIEF TEENMAR MALLANNA KMM PRV
Teenmar Mallanna: మరోసారి చిక్కుల్లో తీన్మార్ మల్లన్న.. ఈ సారి హైదరాబాద్ సీపీ ఆనంద్ దగ్గరికే ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫొటో)
క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యదర్శి ఎస్. కిరణ్ కుమార్ పోలీసులకు పిర్యాదు చేశారు.
మూలిగే నక్కపై తాడి పండు పడ్డట్టుగా ఉంది.. తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) పరిస్థితి. ఇప్పటికే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మల్లన్న(Mallanna) పై మరో కేసు నమోదైంది.. క్యూ న్యూస్ (Q news) అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmar mallanna)పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar) కార్యదర్శి ఎస్. కిరణ్ కుమార్ పోలీసులకు పిర్యాదు చేశారు. మంత్రి పువ్వాడ పై మల్లన్న అసత్యపు ప్రచారం చేస్తున్నాడంటూ సీపీ (CP) సీవి ఆనంద్ (CV Anand) కు ఫిర్యాదు చేశారు. మే 13న తీన్మార్ మల్లన్నకు చెందిన దినపత్రికలో కన్ను పడితే కబ్జానే, ఖమ్మం (Khammam)జిల్లాలో మంత్రి పువ్వాడ అక్రమాలు అనే శీర్షికతో నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేశారని అవి మంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని..
గత నెలలోను తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ క్యూ న్యూస్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. మంత్రి పువ్వాడ ను విమర్శిస్తూ మల్లన్న మాట్లాడిన భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని దీనిని ఎవరూ అంగీకరించరని ఆయన అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర భాష వాడుతున్నారని, దీనివల్ల టీఆర్ఎస్ కార్యకర్తలు, పువ్వాడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే చాలా కేసులు..
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో తీన్మార్ మల్లన్నపై బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటి ఆరోపణల కింద కేసులు నమోదయ్యాయి. ఐతే దీని వెనక ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందునే ఆయనపై కేసీఆర్ సర్కార్ కక్ష గట్టిందని మండిపడుతున్నారు. వరుసగా ఆయనపై కేసులు నమోదవడం.. ఒకదాంట్లో బెయిల్ రాగానే, మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ఆయన గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయంగా ఎదిగే క్రమంలో పాదయాత్రకు కూడ శ్రీకారం చుట్టారు తీన్మార్ మల్లన. కానీ ఆలోపే జైలుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం 74 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. అనంతరం మల్లన్న బీజేపీలోకి చేరారు. అయితే ఆరు నెలలు కూడా తిరగకముందే బీజేపీకి దూరంగా ఉంటున్నారు మల్లన్న. ఆ పార్టీ సిద్దాంతాలు మల్లన్న వ్యక్తిత్వానికి సెట్ అవ్వడం లేదనేది టాక్.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.