తెలంగాణాలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ DGP అంజనీ కుమార్ పోస్టింగ్ లు ఇచ్చారు.
మలక్ పేట ఏసీపీగా శ్యామ్ సుందర్
నార్సింగి ఎసిపిగా రమణగౌడ్
అబిడ్స్ ఏసిపిగా పూర్ణచందర్
చార్మినార్ ఏసీపీగా రుద్ర భాస్కర్
పంజాగుట్ట ఏసీపీగా మోహన్ కుమార్
కుషాయి గూడ ఏసీపీగా వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ డీఎస్పీగా వేంకటగిరి
ఖమ్మం డీఎస్పీగా గణేష్
చేవెళ్ల ఏసీపీగా ప్రభాకర్
అబిడ్స్ ఏసీపీగా పూర్ణ చందర్
కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా ధనలక్ష్మి
మేడ్చల్ ఏసీపీగా సామల వెంకట్ రెడ్డి
బాసర డీఎస్పీగా సురేష్
సైబర్ క్రైమ్ డీఎస్పీగా రవి కుమార్ రెడ్డి
యాదాద్రి ఏసీపీగా సైదులు
సౌత్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా శ్రీనివాస్ రావు
వరంగల్ ఏసీపీగా అబ్దుల్ రహమాన్
బెల్లంపల్లి ఏసీపీగా మహేష్
HMDA డీఎస్పిగా రమణా గౌడ్
సంగారెడ్డి డీఎస్పీగా సామిండ్ల ప్రభాకర్
భువనగిరి (రాచకొండ) ఏసీపీగా సైదులు
నారాయణఖేడ్ డీఎస్పీగా వెంకట్ రెడ్డి
కామారెడ్డి డీఎస్పీగా సురేష్
పాల్వంచ డీఎస్పీగా వెంకటేష్
పెద్దపల్లి ఏసీపీగా ఎడ్ల మహేష్
మీర్ చౌక్ ఏసీపీగా దామోదర్ రెడ్డి
మెదక్ డిసిఆర్బీ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి బదిలీ
ఎల్బీనగర్ ఏసీపీగా అంజయ్య
కాగా కొన్నిరోజుల క్రితం ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దాదాపు 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమించింది ప్రభుత్వం. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ రతన్ నియమితులయ్యారు. ఖమ్మం సీపీగా సురేశ్‌ను నియమించగా, జగిత్యాల ఎస్పీగా భాస్కర్‌ను నియమించారు.
కాగా కొన్నిరోజుల వ్యవధిలో రాష్ట్రంలో భారీగా బదిలీలు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.