Home /News /telangana /

TRANSCO AND GENCO CMD PRABHAKAR RAO SAID THAT POWER CUTS IN TELANGANA IN THE LAST FEW DAYS WERE DUE TO LACK OF INFORMATION PRV

Power Cuts: రైతులకు అలర్ట్​.. తెలంగాణలో గత మూడు రోజులుగా విద్యుత్​ కోతలు.. అసలు కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్నిరోజులుగా తెలంగాణ‌లో విద్యుత్ కోత‌లు విధించారు. అయితే, స‌మాచారం లోపంతోనే ఈ సమ‌స్య ఏర్ప‌డింద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

    ఇప్ప‌టికే  వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ కోత‌లు (Electricity Cut) మొద‌ల‌య్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు మ‌రింత‌గా పెరిగాయి. గత కొన్నిరోజులుగా తెలంగాణ‌లోనూ విద్యుత్ కోత‌లు (Power Cuts) విధించారు. అయితే, స‌మాచారం లోపంతోనే ఈ సమ‌స్య ఏర్ప‌డింద‌ని అధికారులు పేర్కొంటున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ‌లో గురువారం నాడు కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఎన్పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం (due to lack of information) తో వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందనీ, రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యుత్ కోత‌లు (Power Cuts) విధించే నిర్ణ‌యం తీసుకోలేద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

    24 గంటల ఉచిత విద్యుత్..

    రాష్ట్ర రైతాంగానికి శుక్ర‌వారం నుంచి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుంద‌ని టీఎస్ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు (Transco and Genco CMD Prabhakar Rao) వెల్ల‌డించారు. ఇప్ప‌టి నుంచి తెలంగాణ‌ వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండద‌ని తెలిపారు. విద్యుత్ కోత‌లు (Power Cuts) , క‌రెంట్ క‌ట్ లు ఉంటాయ‌ని రాష్ట్ర రైత‌న్న‌లు ఎవ‌రు కూడా ఆందోళన చెందల్సిన అవసరం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా కొన‌సాగిందో ముందు కూడా అలానే ఉంటుంద‌ని టీఎస్ ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

    డిమాండ్​ పెరగడంతో..

    తెలంగాణలో నెలరోజులుగా 1,000 నుంచి 1,500 మెగావాట్ల వరకు విద్యుత్‌ కొరత ఉంటోంది. గత నెలలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనట్టుగా 14,200 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. యాసంగి పంటలు కోతకు రావడంతో రోజువారీ డిమాండ్‌ 12,500 మెగావాట్లకు తగ్గింది.  ఎండలు తీవ్రం కావడంతో గత నెల చివరివారం నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. దీనికితోడు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్ల అమ్మోనియం నైట్రేట్‌ (పేలుడు పదార్థం) కొరత ఏర్పడి బొగ్గు ఉత్పత్తి తగ్గింది.

    విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో..

    బొగ్గు కొరతతో ఓవైపు అకస్మాత్తుగా ధరలు పెరగడం, మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో మరింత ప్రభావం పడింది. విద్యుత్‌ కొరతను తీర్చుకోవడానికి రాష్ట్రాలు పవర్‌ ఎక్సే్ఛంజీని ఆశ్రయించడంతో.. ధరలు యూనిట్‌కు రూ.20 వరకు పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రంగంలో దిగి యూనిట్‌ రేటు రూ.12కు మించకుండా నియంత్రణ విధించింది. పవర్‌ ఎక్సే్ఛంజీ నుంచి గతనెలలో రాష్ట్రం రూ.1,800 కోట్ల విద్యుత్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రోజుకు రూ.30కోట్ల నుం చి రూ.40కోట్ల మేర విద్యుత్‌ కొంటోంది. అదికూడా 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనేందుకు బిడ్‌ వేస్తే.. 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే లభిస్తోందని అధికారు లు చెప్తున్నారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: ELectricity, Farmer, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు