హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: ఆదివాసీలతో కలిసి ఆడి పాడిన ట్రైనీ ఐఏఎస్‌లు.. మురిసిపోయిన అడవి బిడ్డలు

Adilabad: ఆదివాసీలతో కలిసి ఆడి పాడిన ట్రైనీ ఐఏఎస్‌లు.. మురిసిపోయిన అడవి బిడ్డలు

గిరిజన గ్రామాల్లో ఐఏఎస్ అధికారుల పర్యటన

గిరిజన గ్రామాల్లో ఐఏఎస్ అధికారుల పర్యటన

Adilabad: క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జంగామ్ గ్రామంలో విడిది చేసిన ట్రైనీ ఐఏఎస్‌లు గిరిజనులతో కలిసి ఆడి పాడి సందడి చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  వారంతా సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో  (Civil Services) అత్యున్నతమైన ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ కూడా పొందుతున్నారు. అయితే క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా ఊరు కాని ఊరికి వచ్చారు. అడవుల జిల్లా… ఆదివాసుల ఖిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు క్షేత్ర స్థాయి శిక్షణ కోసం వచ్చారు. ఇందులో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్  (komaram bheem Asifabad) జిల్లాలోని జైనూర్ మండలాన్ని సందర్శించారు. ఈ ట్రైనీ కలెక్టర్ల బృందంలో పంకజ్, శ్రిష్టి సింగ్, పెమ టోగాయ్, యక్ష్ చౌదరి, శివాని, అబ్దుల్ రవుఫ్ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల జీవన స్థితిగతులు, వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.

  గిరిజనుల జీవన విధానం (Tribal Lifestyle), ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలను గురించి ఆరా తీశారు. అనంతరం మండలంలోని జంగామ్ గ్రామంలో బస చేసిన ఈ బృందం సభ్యులు ఆదివాసి గిరిజనుల వేషధారణలో ఇక్కడి ఆదివాసి గిరిజనులతో ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. గిరిజనుల సంప్రదాయ వేషధారణలో వారి సంస్క్రతికి అద్దంపట్టే డెంసా నృత్యం చేస్తూ సందడి చేశారు. వారి ఉత్సాహాన్ని చూసి గిరిజనులు మురిసిపోయారు. గిరిజనులతో మమేకమై సరదాగా ఆడిపాడి ట్రైనీ ఐఏఎస్ లు సందడి చేశారు. గురువారం వారంతా ఐటిడిఏ కార్యాలయంలో పిఓ వరుణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందించారు. క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను పిఓ కు వివరించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యా, వైద్యంతో పాటు స్వయం ఉపాధి పథకాలను అందిస్తున్నామని వివరించారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, రైతులు పండించే పంట వివరాలు తదితర అంశాలను వివరించారు. అనంతరం ఉట్నూరు మండలం జీయర్ నగర్ గ్రామంలో పర్యటించి వర్మి కంపోస్ట్, ఆమ్లా, మామిడి పంటలను పరిశీలించారు.

  ఆతర్వాత గ్రామస్తులతో సమావేశమై వారి జీవనస్థితిగతులు, పరిసరాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.  అలాగే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోని పవార్ గూడ గ్రామంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించిన చిరుధాన్యాలు-ఆహార పండుగలో పాల్గొన్నారు. స్థానిక అధికారులు వారికి అవసరమైన తోడ్పాటును అందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా అనుసరించాల్సిన పలు అంశాల గురించి ఐటిడిఏ పిఓ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Adilabad, Telangana

  ఉత్తమ కథలు