హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ సమ్మెపై మరికాసేపట్లో కీలక వాదనలు... ఎవరి వాదన ఏంటి ?

ఆర్టీసీ సమ్మెపై మరికాసేపట్లో కీలక వాదనలు... ఎవరి వాదన ఏంటి ?

అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనను సమర్థవంతంగా వినిపించాలని భావిస్తున్న నేపథ్యంలో... మరికాసేపట్లో మొదలుకాబోయే ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

  ఆర్టీసీ సమ్మెపై మరికాసేపట్లోనే హైకోర్టులో వాదనలు మొదలుకానున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం... చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే అంశాలను కోర్టుకు వివరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తరపు వాదనను కోర్టులో సమర్థవంతంగా వినిపించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కోర్టులో వదులుకున్న ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను కార్మిక సంఘాలు చర్చల సందర్భంగా లేవనెత్తాయనే విషయాన్ని బలంగా వాదించాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.

  మరోవైపు చర్చలు ఏ రకంగా జరిగాయి... చర్చల సందర్భంగా ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనను సమర్థవంతంగా వినిపించాలని భావిస్తున్న నేపథ్యంలో... మరికాసేపట్లో మొదలుకాబోయే ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

  సమ్మె విరమించాలని హైకోర్టు కార్మిక సంఘాలకు ఆదేశాలు జారీ చేస్తుందా ? లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సమ్మె కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అద్దె బస్సుల సంఖ్య పెంచడంతో పాటు రూట్ పర్మిట్లు ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం హైకోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  First published:

  Tags: CM KCR, Rtc jac, Telangana High Court, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు