TRAFFIC RESTRICTIONS ON HYDERABAD TANK BUND ON EVERY SUNDAYS FOR VISITORS CONVENIENCE SK
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ తలనొప్పి ఉండదు..
హుస్సేన్ సాగర్(ఫైల్ ఫొటో)
Hyderabad: ఆదివారం సాయంత్రం వేళలో ట్యాంక్ బంద్ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.
ఆదివారం రోజు అలా సరదాగా బయటకు వెళ్లొద్దామని ప్రతి ఫ్యామిలీ అనుకుంటుంది. సెలవు దినం కావడంతో పిల్లాపాపలతో ఎంజాయ్ చేద్దామని పేరెంట్స్ భావిస్తారు. ఐతే హైదరాబాద్ (Hyderabad)లో ఉండే వారికి మొదట గుర్తొచ్చే పర్యాటక ప్రాంతం ట్యాంక్ బండ్ (Tank Bund). నగరం నడి బొడ్డున ఉండడంతో పాటు చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి. పక్కనే లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ గార్డెన్, సంజీవయ్య పార్క్, స్నో వాల్డ్.. ఇవన్నీ అక్కడక్కడే ఉంటాయి. అందుకే చాలా మంది ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ వీక్షించేందుకు వెళ్తుంటారు. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)ఒడ్డున నిలబడి.. నగర అందాలను వీక్షిస్తుంటారు. కానీ వారికి ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇకపై వారికి ఈ తలనొప్పి ఉండదు. ఎంచక్కా రోడ్డుపై నడుచుకుంటూ ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించవచ్చు.
వీకెండ్స్‌లో ట్యాంక్ బండ్ సందర్శకులకు వాహనాల రాకపోకలు అడ్డుగా మారాయని, రోడ్డును దాటే సమయంలో ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని ఓ నెటిజన్.. మంత్రి కేటీఆర్ (KTR)కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అతడి ఐడియా బాగుందని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. ప్రతి ఆదివారం వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్, పోలీస్ కమిషనర్‌కి ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు. ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు.
ప్రతి ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్ బండ్ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. వచ్చే ఆదివారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు. ట్యాంక్ బంద్ మీదుగా వెళ్లే వాహనాలను వేరే మార్గాల్లో దారి మళ్లిస్తారు.
ఐతే సందర్శకుల వాహనాలను సైతం ట్యాంక్ బండ్ రోడ్ల మీదకు అనుమతించరు. వారికి కూడా బయటే పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఆ సమయాల్లో కేవలం పాదచారులకు మాత్రమే ట్యాంక్ బండ్‌పైకి అనుమతిస్తారు. అంటే ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ రోడ్లపై ఏ వాహనాన్నీ అనుమతించరు. సందర్శకులు ఎంచర్కా రోడ్ల మీద నడుస్తూ హుస్సేన్ సాగర్ అందాలను వీక్షింవచ్చు.
కాగా, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు ఎప్పుడూ కిక్కిరిసి కనిపిస్తుంటాయి. పెద్ద మొత్తంలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం పూట సందర్శకుల వాహనాలు కూడా తోడవడంతో.. రోడ్డు పొడవునా వాహనాలు క్యూకట్టి ఉంటాయి. భార్యాపిల్లతో వచ్చే సందర్శకులు ఆ ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల మధ్య రోడ్డును దాటలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఇవతలి నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే చాలా సేపు వేచి చూడాల్సి ఉంటుంది. ఐతే ఇకపై ఈ ఇబ్బందులు ఉండవు. ఆదివారం సాయత్రం పూట ట్యాంక్ బండ్‌పై ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.