హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Updates : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు... ఏపీ నుంచీ హైదరాబాద్‌‌కి తిరిగొస్తున్న ప్రజలు

Hyderabad Updates : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు... ఏపీ నుంచీ హైదరాబాద్‌‌కి తిరిగొస్తున్న ప్రజలు

ట్రాఫిక్ జామ్

ట్రాఫిక్ జామ్

Hyderabad Updates : సంక్రాంతి సందడి పూర్తిగా ముగియక ముందే... కనుమ జరుపుకోకుండానే ఏపీ ప్రజలు హైదరాబాద్‌కి తిరుగుముఖం పట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రెండు విషయాలకూ సంబంధం లేకపోయినా, ఆంక్షల వల్ల ప్రయాణాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

ఇంకా చదవండి ...

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. అందువల్ల ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు... రెండు గంటల పాటు రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గాలన్నీ మూసివేయబోతున్నారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఆంక్షల సమయంలో రాజ్‌భవన్ రోడ్డులో వెళ్లాల్సిన వారు, ఇతర మార్గాలు చూసుకోవాలని సూచించారు. జనవరి 17 నుంచీ 20 వరకూ నాలుగు రోజులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ 119 మంది ఎమ్మెల్యేలతో (నామినేటెడ్ సభ్యుడితో కలిపి) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంక్రాంతి సెలవుల కారణంగా సోమ, మంగళవారం హైదరాబాద్ రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ మాత్రం ఏపీ ప్రజలు తిరిగి వస్తుండటంతో మళ్లీ రద్దీ కనిపిస్తోంది.


సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఏపీ ప్రజలు సొంత ఊర్లకు వెళ్లినప్పుడు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కనిపించింది. కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ అయ్యింది. ఇక టోల్ గేట్ల దగ్గర పెద్ద దుమారమే అయ్యింది. టోల్ రద్దు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా... టోల్ ఆపరేటర్లు వెంటనే అమల్లోకి తేకపోవడంతో వివాదం చెలరేగింది. ఇప్పుడు తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రే బయలుదేరిన ప్రజలు ఇవాళ ఉదయం నుంచీ హైదరాబాద్ వస్తున్నారు. అందువల్ల తిరిగి రోడ్లపై రద్దీ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:


World Record Egg : ఇన్‌స్ట్రాగ్రాం ఎగ్ పగలబడి నవ్వితే... ప్యాట్రిక్ స్టార్ వైరల్ వీడియో


Head Wobble Challenge : హెడ్ వబుల్ ఛాలెంజ్... మీరూ పాల్గొంటారా... వైరల్ వీడియో


కేఏ పాల్ కాళ్లు మొక్కిన రాంగోపాల్ వర్మ? వామ్మో..ఈ కాంబినేషన్ ఏంటి?

First published:

Tags: Hyderabad, Hyderabad Metro, Telangana News

ఉత్తమ కథలు